కేసీఆర్ వల్లే సూసైడ్స్: నారాయణ, ఎర్రబెల్లి ఆగ్రహం

అసెంబ్లీలో నిలదీస్తాం: ఎర్రబెల్లి
పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకుంటే మళ్లీ సర్వే అంటున్నారని ధ్వజమెత్తారు. పరిపాలనలో పక్క రాష్ట్రాలను చూసి ప్రభుత్వం నేర్చుకోవాలన్నారు. ప్రజా సమస్యల పైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
పరిపాలించడం చేతకాకపోతే పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. కృష్ణపట్నం విద్యుత్ విషయంలో హిందుజాను చంద్రబాబు బెదిరించారంటూ కేసీఆర్ ఆరోపించారని, మంత్రులు అడిగిన సంగతి గురించి మాట్లాడరేమని ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల ధర్నా
తెలంగాణ రైతాంగానికి ఎనిమిది గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఇక్కట్లను రూపుమాపాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో నిరసనలు చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్‌లోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు వారు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు పొన్నాలక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, జానారెడ్డి, డీకే అరుణ, నంది ఎల్లయ్య తదితరులు హాజరయ్యారు.
రామగుండంలో వెయ్యిమెగావాట్ల విద్యుదుత్పత్తి
రామగుండంలో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో చెప్పారు. రామగుండంలో నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీడీ కార్మికులకు రూ.వెయ్యి పించన్ ఇస్తామన్నారు. తెలంగాణలో పరిశ్రమలు మూసివేతకి సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అమరుల కుటుంబాలకు సాయంపై ప్రభుత్వం ఉత్తర్వులు
అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు గుర్తించిన 459 కుటుంబాలకు సాయం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆర్థిక సాయానికి సంబంధఇంచి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు సూచించింది.












Click it and Unblock the Notifications