ఖేడ్‌లో టిఆర్ఎస్ గెలుపు, డిపాజిట్ కోల్పోయిన టిడిపి: కెసిఆర్‌కు పుట్టిన రోజు కానుక

హైదరాబాద్: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ 53,625 ఓట్లతో గెలిచింది. ఖేడ్ నుంచి తెరాస తరఫున గెలిచిన భూపాల్ రెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టిడిపి డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకొని పరువు కాపాడుకుంది. గెలుపు పైన మంత్రులు కెటిఆర్, హరీష్ రావులు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి 14వేల ఓట్లు సాధించగా, కాంగ్రెస్ 39వేల ఓట్లు సాధించింది.

టిఆర్ఎస్ పార్టీకి 93,076 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 39,451, టిడిపికి 14,787 ఓట్లు వచ్చాయి. ఖేడ్‌ను అభివృద్ధి చేస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గెలిచిన భూపాల్ రెడ్డి అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఈ విజయం కెసిఆర్‌కు అంకితమని చెప్పారు. టిడిపి అంటే తెలంగాణలో డిపాజిట్లు రాని పార్టీ అని కెటిఆర్ అన్నారు.

మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫిబ్రవరి 13న నిర్వహించిన పోలింగ్‌లో 1,54,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అంతకుముందు... మొత్తం 137 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. సీసీ టీవీ కెమెరాల మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం ప్రధాన టేబుల్‌తో సహా 14 టేబుళ్లు ఏర్పాటు చేసి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడయ్యాయి.

Narayanakhed Bypoll

ప్రతి టేబుల్ వద్ద నలుగురు గెజిటెడ్ అధికారులు పర్యవేక్షించారు.. రౌండ్లవారీగా ఫలితాలను మీడియాతోపాటు వెబ్‌సైట్లో ఎప్పటికప్పుడు పొందుపర్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల కిష్టారెడ్డి హఠాన్మరణంతో నారాయణఖేడ్‌‌కు ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌తో పాటు టీడీపీ, కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. నారాయణఖేడ్ ఉపఎన్నికను టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+