వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

kcr కు చెక్ పెట్టేలా...!! న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా కీల‌క నిర్ణ‌యం?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుకు చెక్ పెట్టేలా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఇక‌నుంచి నెల‌కు రెండు నుంచి మూడురోజ‌లపాటు అమిత్ షా ప‌ర్య‌టించ‌బోతున్నారని తెలిపారు. వ‌చ్చే నెల‌లో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర పునఃప్రారంభిచ‌బోతున్నారు. ముగింపు స‌భ‌కు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజ‌రు కాబోతున్నారు.

కేసీఆర్ ఢిల్లీ రాకుండా..

కేసీఆర్ ఢిల్లీ రాకుండా..

జాతీయ‌స్థాయిలో మోడీని నిలువ‌రించ‌డానికి జాతీయ‌పార్టీ పెట్టాల‌నే యోచ‌న చేసిన కేసీఆర్ ప్ర‌స్తుతం వేరే మార్గంలో ప‌య‌నింప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కొత్త పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డానికి స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని భావించ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. కేసీఆర్ ను ఢిల్లీ రాకుండా నిలువ‌రించాలంటే రాష్ట్రంలో ఆయ‌న‌కు ఊపిరి ఆడ‌నివ్వ‌కుండా ఉండేలా వ్యూహాలు ప‌న్నాల‌ని బీజేపీ పెద్ద‌లు నిర్ణ‌యించారు. అందులో భాగంగానే అమిత్ షా నెలకు మూడురోజులపాటు పర్యటించడమేకాదు.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పార్టీని పరిగెత్తించనున్న పెద్దలు

పార్టీని పరిగెత్తించనున్న పెద్దలు

రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మ‌రో ప్ర‌త్య‌ర్థిగా ఉండ‌టం, ఆ పార్టీలో జోరుగా చేరిక‌లు ఉండ‌టంతో మ‌రింత చురుగ్గా బీజేపీని ప‌రిగెత్తించ‌బోతున్నారు. బండి ప్ర‌జా సంగ్రామ యాత్ర సంద‌ర్భంగా మొదటి చేరిక‌లకు తెరతీయాలని భావిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా బ‌ల‌మైన‌వారికోసం ఒక ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న బీజేపీ అందుక‌నుగుణంగా తన ప్రణాళికను అమలు చేయబోతోంది. అయితే టీఆర్ఎస్ నుంచి కంటే కాంగ్రెస్ పార్టీ నుంచే చేరికలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమిత్ షాతోపాటు మోడీ కూడా..

అమిత్ షాతోపాటు మోడీ కూడా..


కేసీఆర్ ను ఇక్క‌డ నిల‌వ‌రిస్తేనే ఆయ‌న్ను ఢిల్లీ వ‌ర‌కు రానివ్వ‌కుండా చూడొచ్చ‌నేది బీజేపీ యోచనగా ఉంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో అమిత్ షాతోపాటు న‌రేంద్ర‌మోడీ కూడా త‌రుచుగా తెలంగాణ ప‌ర్య‌టించే అవ‌కాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎట్టి ప‌రిస్థితుల్లోను కమలం జెండాను రెపరెపలాడించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా ఉన్న అన్ని అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉండటం, రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోరు హోరాహోరీగా సాగుతుందని పలు సర్వేలు కూడా స్పష్టం చేస్తుండటంతో ఆచి తూచి అడుగులు వేయాలని భావిస్తోంది.

English summary
Amit Shah has decided to visit Telangana for three days a month to stop KCR in the upcoming elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X