Karimnagar: లక్కీ డ్రాలో మిక్సీ గెలుచుకున్న నరేంద్ర మోదీ..!

తెలంగాణలో వినాయక చవతి, దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. దేవి నవరాత్రల సందర్భంగా అమ్మవారి విగ్రహాలను మండపాల్లో ప్రతిష్టిస్తుంటారు. నవరాత్రులు పూర్తి అయన తర్వాత దేవి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. నవ రాత్రుల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దండియా నిర్వహిస్తారు. చిన్న, పెద్ద అందరు కలిసి దండియా ఆడతారు. కోలాలు వేస్తారు. దండియా తో పాటు పలు మండపాల్లో లక్కీ డ్రా కూడా నిర్వహిస్తుంటారు. రూ.5 ఒక టికెట్ లేదా, రూ.10 ఒక టికెట్ విక్రయిస్తుంటారు.

చివరి రోజు లక్కీ డ్రా తీస్తారు. ఇలానే దసరా దేవి నవరాత్రుల సందర్భంగా నరేంద్ర మోదీకి బహుమతి వచ్చింది. నరేంద్ర మోదీ బహుమతి రావడం ఏంటని మీరు అనుకోవచ్చు.. కానీ నిజంగానే నరేంద్ర మోదీకి రెండోవ బహుమతి వచ్చింది. ఓ మోదీ అభిమాని.. తన పేరు మీద కాకుండా నరేంద్ర మోదీ పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. అదే టికెట్ కు లక్కీ డ్రాలో బహుమతి వచ్చింది. టికెట్ పై నరేంద్ర మోదీ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Narendra Modi wins Mixi as the second prize in the lucky draw

కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ శక్తి యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండపం ఏర్పాటు చేసి దుర్గా దేవీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా కూడా నిర్వహించారు. డ్రాలో తొలి బహుమతిగా కూలర్.. రెండో బహుమతిగా మిక్సీ.. మూడో బహుమతిగా గ్యాస్ స్టవ్ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఇలా చాలా మంది లక్కీ డ్రాలో పాల్గొనడానికి టికెట్లు కొనుగోలు చేశారు. నవరాత్రుల చివరి రోజు నిర్వాహకులు లక్కీ డ్రా నిర్వహించారు.

లక్కీ డ్రాలో నరేంద్ర మోదీ అనే టికెట్ కు రెండో బహుమతి మిక్సర్ వచ్చింది. దీంతో టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తికి నిర్వాహకులు మిక్సర్ అందజేశారు. అయితే తనకు ప్రధాని నరేంద్ మోదీ అంటే ఇష్టమని బహుమతి గెలుచుకున్న వ్యక్తి చెప్పాడు. అందుకే నరేంద్ర మోదీ పేరుతో టికెట్ కొనుగోలుచేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+