హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోను సూద్ ను కలిసిన నర్సంపేట వాసి .. శాలువాతో సన్మానించిన రియల్ హీరో !!

|
Google Oneindia TeluguNews

వరంగల్ జిల్లా నర్సంపేట వాసి శీలం భానుప్రసాద్ సోనూసూద్ ను కలిశారు. కరోనా కష్టకాలంలో రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో గా, పేదలకు ఆపద్బాంధవుడిగా తన వంతు సహాయ సహకారాలు అందించిన సోను సూద్ ఎంతోమంది జీవితాలను నిలబెట్టిన దేవుడయ్యాడు. సోనుసూద్ తన సూద్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారికి ఆయన అందించిన సహాయ సహకారాలు అంతాఇంతా కాదు.

సోనూ సూద్ ఫౌండేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సూద్ ఫౌండేషన్ ఫాన్స్

సోనూ సూద్ ఫౌండేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సూద్ ఫౌండేషన్ ఫాన్స్


ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రెండవ వేవ్ లో ఆక్సిజన్ కొరత విపరీతంగా నెలకొన్న నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్ ను నెల్లూరులో ఏర్పాటు చేస్తానని మాటిచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నారు సోనుసూద్. ఇక సోనూసూద్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సూద్ పౌండేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఎంతో మంది తమవంతు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నర్సంపేట వాసు శీలం భానుప్రసాద్ సోనుసూద్ ఫౌండేషన్ ద్వారా, సూద్ ఫౌండేషన్ లో భాగంగా తన వంతు సేవలను అందిస్తున్నారు.

 హైదరాబాద్ లో సోను సూద్ ను కలిసిన వరంగల్ జిల్లా నర్సంపేట వాసి

హైదరాబాద్ లో సోను సూద్ ను కలిసిన వరంగల్ జిల్లా నర్సంపేట వాసి

ఈ నేపథ్యంలో హైదరాబాద్ షూటింగ్ నిమిత్తం వచ్చిన సోనూసూద్, తెలుగు రాష్ట్రాలలో సూద్ ఫౌండేషన్లో సేవలందిస్తున్న వారిని ప్రత్యేకంగా పిలిపించుకొని వారికి కృతజ్ఞతలు తెలిపి, శాలువాతో సత్కరించి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. అందులో భాగంగానే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నుండి సూద్ పౌండేషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న శీలం భానుప్రసాద్ సోను సూద్ చేతులమీదుగా చిరు సత్కారం అందుకున్నారు.

సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి సోను సూద్ చిరు సత్కారం

సోను సూద్ తనను కలిసిన వారిని ఆప్యాయంగా పలకరించి వారితో సూద్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలపై మాట్లాడారు . సోనూసూద్ ని కలవడం మర్చిపోలేని అనుభూతి అని ఆయనను కలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన చేతుల మీదుగా శాలువా కప్పి అభినందన తెలియజేయడంతో నిజంగా జన్మ ధన్యమైందని శీలం భానుప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న సోనూసూద్ వంటి హీరోలకు అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు.

English summary
Sonu Sood, who came for the Hyderabad shooting, specially called on those serving in the Sood Foundation in the Telugu states and thanked them and suggested that the service programs should continue . Seelam Bhanuprasad from narsampet met Sonu Sood, who is actively involved in Sood Foundation activities from Warangal District honored with shawl by sonusood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X