ప్రియాంకారెడ్డి హత్యపై నివేదిక కోరిన జాతీయ మహిళా కమీషన్.. సుమోటోగా కేసు విచారణ

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసుపై జాతీయ మహిళా కమీషన్ దృష్టి సారించింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్బయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి హత్యఘటన పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని జాతీయ మహిళా కమీషన్ స్పష్టం చేసింది.

ప్రియాంకా రెడ్డి కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వాన్ని,సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్‌ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ ఓ లేఖ రాసింది. ఇక జాతీయ మహిళా కమీషన్ సైతం కేసు విచారణకు ఓ బృందాన్ని పంపుతున్నట్లు పేర్కొంది.

అంతే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ . ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతారని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested
    National Womens Commission seeking report on Priyanka reddy murder.. taken the case as suo moto

    దేశ వ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్న ప్రియాంకారెడ్డి హత్య కేసులో ఇటు తెలంగాణా పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. దారుణ ఘటనకు కారణమైన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసు శాఖ గుర్తించింది.

    ఈ మేరకు నిందితుడి ఫోటోను సైతం మీడియాకు విడుదల చేశారు. ఇది ఇలా ఉంటె ఇప్పటికే ప్రియాంక రెడ్డి హత్య కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది . హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై అన్ని వర్గాలు తీవ్ర నిరసన, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో జాతీయ మహిళా కమీషన్ సైతం విచారణకు కమిటీ వేసి,స్పందించటం గమనార్హం .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+