జూబ్లీహిల్స్‌లో అప్పుడే వేట మొదలు పెట్టిన నవీన్ యాదవ్

నవ యువ నిర్మాణ్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహమూద్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 2000 మంది గర్భిణీలకు సీమంతం, 1000 మంది చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ విశ్వనాథ్ పెరుమాళ్ల, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రికార్డుల చరిత్రలో నవ యువ నిర్మాణ్
ఇంత పెద్ద ఎత్తున సామూహికంగా సీమంతం నిర్వహించడం ఒక రికార్డు. ఈ అసాధారణ కార్యక్రమాన్ని గుర్తించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు, నవ యువ నిర్మాణ్ సంస్థ చైర్మన్ పి. నవీన్ యాదవ్‌కు రికార్డు పత్రాలను అందజేశారు. ఈ ఘనతతో నవీన్ యాదవ్, నవ యువ నిర్మాణ్ సంస్థ చరిత్రలో నిలిచిపోయాయి.

Nav Yuva Nirman Chairman Naveen Yadav Honored by Book of Records

సహకార స్ఫూర్తితోనే విజయం
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ, తమ సంస్థ ఏ కార్యక్రమం నిర్వహించినా మహిళల సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి చైర్మన్ గద్దర్ వెన్నెల, మైనార్టీ వెల్ఫేర్ వైస్ చైర్మన్ షహీమ్ ఖురేషి, ఎమ్మెల్సీ అభ్యర్థి అజారుద్దీన్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వంటి పలువురు నాయకులు పాల్గొన్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం, సామాజిక సేవకు ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్‌లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రేసులో అజారుద్దీన్ పేరు వినిపిస్తున్నప్పటికీ, అధిష్టానం నవీన్ యాదవ్‌ వైపే మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. దీనిలో భాగంగానే నవీన్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+