Naveen Reddy: గోవాలో నవీన్ రెడ్డి అరెస్ట్.. కిడ్నాప్‍కు ఎలా ప్లాన్ చేశాడంటే..!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్టయ్యాడు. 5 రోజులుగా తప్పుంచుకు తిరుగుతున్న అతన్ని గోవాలో అరెస్ట్ చేశారు. కాండోలిమ్ బీచ్‌లో పట్టుబడిన అతన్ని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. నవీన్ నుంచి ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో నవీన్ రెడ్డి బాధితురాలిని దాదాపు వంద మందితో వచ్చి భీభత్సం సృష్టించి సినీఫక్కిలో కిడ్నాప్ చేశాడు.

కార్లు ధ్వంసం
కిడ్నాప్ సమయంలో బాధితురాలి ఇంటి ముందు కార్లను ధ్వంసం చేశారు.ఇంట్లో ఉన్న సీసీ కెమెరా, డివిఆర్ లను కారులో ఎత్తుకెళ్లారు. కారులో నల్గొండ వైపు వెళ్లారు.అయితే ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టంచింది.

అదే రోజు సాయంత్రం
తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్ రెడ్డి, అతని స్నేహితులు అదే రోజు సాయంత్రం బాధితురాలిని విడిచి పెట్టారు. నవీన్ రెడ్డి చాలా చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

కస్టడీ
కాగా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుల్లో ఐదుగురిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో మంగళవారం పోలీసులు పిటిషన్ వేశారు. నిందితుల్లో ఏ3 -భానుప్రకాష్, ఏ4 రాథోడ్ సాయినాథ్, ఏ8 గానోజి ప్రసాద్, ఏ9 కోతి హరి, ఏ30 -బోని విశ్వేశ్వర్‌గా ఉన్నారు. వీరిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.

రిమాండ్ రిపోర్ట్
ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సడ్మిట్ చేశారు. వారం రోజుల కిందే బాధితురాలి కిడ్నాప్‌కు నవీన్ రెడ్డి ప్రణాళిక వేశాడు. తన స్నేహితులు రుమాన్, సిద్దు, చందు, సాయినాథ్, నాగరాజు కిడ్నాప్ ప్లాన్ కీలకంగా ఉన్నారు.

కీలకంగా ఉన్న వారు
బాధితురాలిని కిడ్నాప్ చేసిన తర్వాత నవీన్ రెడ్డి తన వోల్వ కారులో తీసుకెళ్లాడు. చందు డ్రైవింగ్ చేయగా.. సిద్దు ముందు సీట్‌లో కూర్చున్నాడు. బాధితురాలిని మధ్య సీట్లో కూర్చొబెట్టుకుని నవీన్‌రెడ్డి, రుమాన్, సాయినాథ్, నాగరాజు వెళ్లారు. అరిస్తే చంపేస్తామని బాధితురాలిని వారు బెదిరించారు. అదే సయంలో పోలీసులు తప్పుదోవ పట్టించేందుకు నవీన్‌రెడ్డి తన ఫోన్ ను మరో కారులో వేసి విజయవాడ రూట్‌లో పంపించారు.












Click it and Unblock the Notifications