వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగస్టర్ నయీమ్: నక్సల్స్ వ్యతిరేకిగా ఎలా మారాడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అప్పటి పీపుల్స్‌వార్ (ఇప్పటి మావోయిస్టు) తీరుతో తీవ్రమైన కసిపెంచుకున్న నయీముద్దీన్ అలియాస్ నయీమ్ కరుడుగట్టిన గ్యాంగస్టర్‌గా మారాడు. తన అక్క పట్ల ఓ పీపుల్స్‌వార్ సానుభూతిపరుడు ఈదన్న అనే వ్యక్తి అనుసరిస్తున్న వైఖరిపై పీపుల్స్‌వార్ చర్యలు తీసుకోకపోవడం వల్లనే అతను నక్సలైట్ వ్యతిరేకిగా మారినట్లు తెలుస్తోంది.

నయీమ్ అక్క పీపుల్స్‌వార్ కార్యకలాపాల పట్ల చురుగ్గా వ్యవహరించిన ప్రభావమే నయీమ్ ఆ గ్రూప్ వైపు మళ్లినట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో గ్రైనెైట్ దాడిలో నయీమ్ తొలిసారి అరెస్టయ్యాడు. ఆ తర్వాత పీపుల్స్‌వార్‌గా మారాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన పీపుల్స్‌వార్‌ అజ్ఞాతదళంలో చేరాడు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఐపియస్ అధికారి హత్య కేసులో నయీమ్ మరోసారి అరెస్టయ్యాడు.

అప్పుడు అతన్ని అప్పటికే ముషీరాబాద్ జైల్లో ఉన్న టాప్ నక్సలైట్ల బ్యారెక్‌లో చేర్చారు. అక్కడ పీపుల్స్‌వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ వంటివారితో సాహచర్యం ఏర్పడింది. దాంతో అతను మామూలు స్థాయి నుంచి విషయాలను అర్థం చేసుకునే స్థాయికి ఎదిగాడు.

Naxalite theory: The emergence of Nayeem

1987 ప్రాంతంలో అతను పీపుల్స్‌వార్‌లో చేరాడు. అయితే, ఈదన్న బార్య‌పై అత్యాచారం యత్నం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సహాయంగా నయీమ్ అక్క ఉండేది. ఈ సమయంలో ఈదన్న నయీమ్ అక్క పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్క తన సోదరుడు నయీమ్‌కు చెప్పింది. ఈ విషయంపై పీపుల్స్‌వార్ కమిటీక లేఖలు రాసి, చర్యలు తీసుకోవాలని కోరాడని అంటారు. అయితే, పీపుల్స్‌వార్ ఈదన్నపై చర్యలు తీసుకోకుండా క్షమించి వదిలేయాలని అనుకుంది.

దాంతో తీవ్రంగా ఆగ్రహించిన నయీమ్ నక్సలైట్ వ్యతిరేకిగా మారాడు. అతను జైల్లో ఉండగానే అతని సోదరుడు అలీముద్దిన్ ద్వారా ఈదన్నను హత్య చేయించాడని అంటారు. ఈదన్నను పోలీసులే హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై సిఐడి దర్యాప్తు జరిగింది. అయితే, సిఐడి దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసింది.

నయీమ్ సోదరుడు అలీముద్దీన్ ఈదన్న హత్యలో ప్రధాన భూమిక పోషించాడని తెలిసింది. దీంతో పీపుల్స్‌వార్ నక్సలైట్లు అలీముద్దీన్‌ను చంపేశారు. తన సోదరుడి హత్యలో కీలక పాత్ర పోషించిన విప్లవ గాయని బెల్లి లలితను నయీమ్ ఫ్యామిలీ మట్టుబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు అనుమానం ఉన్న పౌర హక్కుల సంఘం నాయకుడు పురుషోత్తమ్ హత్యలో నేరుగా నయీమ్ పాల్గొన్నట్లు చెబుతున్నారు. అప్పటికి అతను జైలు నుంచి బయటకు వచ్చాడు.

Naxalite theory: The emergence of Nayeem

ఆ తర్వాత మరో పౌర హక్కుల సంఘం నాయకుడు ఆజం అలీ హత్య కూడా ఈ క్రమంలోనే జరిగింది. పురుషోత్తమ్ సంస్మరణ సభను నల్లగొండలో ఏర్పాటు చేశాడనే కారణంతో ఆజం అలీని నయీమ్ ముఠా మట్టుబెట్టినట్లు చెబుతారు. పీపుల్స్‌వార్ నక్సలైట్‌గా నయీమ్ ఏడున్నరేళ్లు జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే పురుషోత్తమ్, ఆజం అలీ హత్యలు జరిగాయని అంటారు.

ఆ తర్వాత నయీమ్ తనదంటూ ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని నక్సలైట్లను, ఉగ్రవాదులను పట్టుకోవడంలో నయీమ్ పోలీసులకు సహకరిస్తూ వచ్చాడనే ఊహాగానాలు ఉన్నాయి. సోహ్రబుద్దీన్ హత్య ఈ క్రమంలోనే జరిగిందని అంటారు. మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాములులను తన కార్యకలాపాలకు అడ్డు వస్తున్నారనే కారణంతో మట్టుబెట్టినట్లు చెబుతారు. వారిద్దరి కూడా నల్లగొండ జిల్లానే.

నయీమ్ నల్లగొండ జిల్లా భువనగిరికి చెందినవాడు. తొలుత విప్లవ విద్యార్థి సంఘంలో ఆర్ఎస్‌యులో చురుగ్గా పాల్గొన్న నయీమ్ తర్వాత పీపుల్స్‌వార్ ఫుల్ టైమర్‌గా మారి, ఆ తర్వాత గ్యాంగస్టర్‌గా అవతారమెత్తాడు. చివరకు పోలీసుల చేతిలో హతమయ్యాడు. అతను గ్యాంగస్టర్‌గా అజ్ఞాతంలో ఉన్నప్పుడో ఓ టీవీ చానెల్ ప్రతినిధి చేసిన ఇంటర్వ్యూ అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

English summary
An earstwhile peoples war and present Maoist activist Nayeem turned into an anti naxalite. Read that exclusive story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X