నాలుగు మర్డర్లు: లైంగిక వాంఛ తీర్చలేదని మైనర్‌ను నరికి చంపిన నయీం
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్ షిప్‌లో ఉన్న డెన్‌లో లైంగిక వాంఛ తీర్చలేదని ఇద్దరిని, భూ దందాకు సంబంధించి వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు వ్యక్తులను నయీం హతమార్చినట్టు తాజా విచారణలో వెలుగుచూశాయి.
హత్యకు గురైన వారిలో ఓ మైనర్ బాలికతో పాటు ఓ పసికందు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మైనర్ బాలికను గొడ్డలితో నరికి చంపగా, పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు తీసినట్టు విచారణలో నయీం అనుచరులు ఫర్హానా వెల్లడించింది.
కోర్టు అనుమతితో ఫర్హానా, అఫ్షాలను కస్టడీలోకి తీసుకుని విచారించిన నార్సింగి పోలీసులు కొత్త విషయాలను రాబట్టారు. నయీంకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన మాజీ మావోయిస్టు టెక్ మధు నెలల రోజుల పిల్లల్ని సైతం తీసుకువచ్చి నయీంకు అప్పగించినట్లు వెల్లడైంది.
లైంగిక వాంఛ తీర్చలేదన్న కారణంతో 16 ఏళ్ల లోపు ఇద్దరు బాలికను అత్యంత కిరాతకంగా చంపినట్టు విచారణలో ఫర్హానా వెల్లడించింది. నయీంతోపాటు తాను కూడా ఆ బాలికలను కత్తులతో పొడిచి చంపానని ఫర్హానా చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.
మూడు నెలల క్రితం నయీం బెడ్ రూంలోనే ఈ ఘటన జరిగినట్టు ఆమె పోలీసుల విచారణలో పేర్కొంది. శంషాబాద్‌లోని ఓ భూ తగాదా విషయంలో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి అల్కాపురిలోని తన ఇంటికి తీసుకొచ్చాడని, భూ పత్రాలపై సదరు యజమానులు సంతకాలు పెట్టకపోవడంతో వారిని తన ఇంటికి అతి సమీపంలోనే సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపినట్టు ఫర్హానా వెల్లడించింది.
దీంతో నయీం కేసులో ఐపీసీ 302 సెక్షన్‌ను కూడా చేర్చినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం ఇంటిపై నార్సింగి పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడున్న 11 మంది పిల్లల్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
వీరిలో 9 మంది నయీంతో పాటు ఫర్హానా, అఫ్షాలతో ఎలాంటి సంబంధం లేనివారు ఉండటంతో వారిని సైదాబాద్, హైదర్షాకోట్‌ల్లోని బాలసదన్‌లలో చేర్పించారు. పిల్లల నుంచి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఆ ఇంట్లో మొత్తం 24 మంది పిల్లలు ఉండే వారని గుర్తించారు.
నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నయీం అనుచరులు యువతులతో పాటు బాలికలను ఉపాధి పేరుతో తీసుకువచ్చేవాడని, అనంతరం వీరిని ఫర్హానాతో పాటు అఫ్షాలకు అప్పగించే వాడని తెలుస్తోంది. బాలికలకు మత్తమందులు ఇచ్చి నయీం వారిపై శారీరక, మానసిక అకృత్యాలకు పాల్పడేవాడు.

నయీం
లైంగిక వాంఛ తీర్చని బాలికలను సున్నిత అవయవాలపై కొడుతూ హింసించేవాడు. నయీం అనుచరులతో పాటు సమీప బంధువులు సైతం అల్కాపురిలోని నయీం ఇంటికి వచ్చినప్పుటు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. ఆ తర్వాత వారిని గోవా, ముంబైతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి అమ్మేసేవాడు.

నల్గొండ
ఈ క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ బాలిక నయీం అరాచకాలను ఎదిరించింది. దీంతో నయీం, ఫర్హానా తదితరులు తల్వార్లు, గొడ్డళ్లతో దాడి చేసి ఇంట్లోనే ఆ బాలికను దారుణంగా హత్య చేశారు. దీనిని చూసిన మిగతా మైనర్లు కొన్ని రోజుల పాటు భోజనం తినకుండా పస్తులు ఉన్నారు.

బాలిక హత్య
బాలిక హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మిగిలిన బాలికలతో ఇంటిని శుభ్రం చేయించిన నయీం బాలిక మృతదేహాన్ని వాహనంలో తీసుకువెళ్లి మాయం చేశాడు. మైనర్ బాలికలపై నయీం అక్రమాలను ఫర్హానా, అఫ్షాలు పోలీసు కస్టడీలో వెల్లడించారు.

నాలుగు మర్డర్లు: లైంగిక వాంఛ తీర్చలేదని మైనర్‌ను నరికి చంపిన నయీం
దీనిపై శుక్రవారం ఫోరెన్సిక్ నిపుణులను ఆ ఇంటికి తీసుకువెళ్లిన పోలీసులు పలు కీలకాధారాలు, నమూనాలు సేకరించారు. ఈ హత్య, మైనర్లపై అత్యాచారం, లైంగిక వేధింపుల విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ కేసులో హత్య తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లనూ చేర్చారు.












Click it and Unblock the Notifications