ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడలితో దందా: 30 మందితో లైంగిక వాంఛ తీర్చుకున్న నయీం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసు కాల్పుల్లో మరణించిన గ్యాంగస్టర్ నయీం ఛత్తీస్‌గఢ్‌లోనూ పెద్ద యెత్తున దందా సాగించినట్లు తెలుస్తోంది. రాయ్‌పూర్‌లో తన సహాయంతో భారీగా ల్యాండ్ సెటిల్మెంట్లు నయీం చేసినట్టు నయీం అక్క కూతురు సాజిదా పోలీసులకు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.

గ్రానైట్, కంకర రాళ్ల వ్యాపారం పేరుతో ఒంగోలు లోనూ నయీం డెన్ ఏర్పాటు చేశాడని విచారణ సందర్భంగా ఆమె చెప్పింది. ఒంగోలులో రూ.10 వేలకు ఓ మూడు బెడ్‌రూంల ఇంటిని కిరాయి తీసుకొని డెన్ ప్రారంభించామని, ఆ ఇంట్లో నలుగురు మహిళలు ఉండేవారని తెలిపింది. ప్రతీ నెల డెన్‌ను చూడడానికి వచ్చి మహిళలతో లైంగిక కోరికలు తీర్చుకునేవాడని ఆమె పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

కాగా, తుక్కుగూడ, పుప్పాలగూడ, అల్కాపురి డెన్‌లో మొత్తం 30 మంది మైనర్లతో లైంగిక వాంఛలు తీర్చుకొన్నట్టు విచారణలో తేలిందని అంటున్నారు. తమకు సహకరించని వారిపై నయీం, అతడి భార్య హసీనా క్రూరంగా దాడిచేసేవారని, పాములు, తేళ్లతో బయటపెట్టే వారని పోలీసుల దృష్టికి వచ్చింది. మైనర్లతో నయీం లైంగిక కార్యకలాపాలకు భార్య తోడ్పాటునందించేదని పోలీసులు అంటున్నారు.

Nayeem den in Ongole: Sajida is the incharge

ఛత్తీస్‌గడ్‌ ఆస్తులు భార్య పేరు మీదే..

చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో నాలుగేండ్ల క్రితం డెన్‌ను ప్రారంభించి దాదాపు రూ.50 కోట్ల ఆస్తులను కూడబెట్టాడని విచారణలో బయటపడిందని చెబుతున్నారు. ఈ ఆసులన్నీ సాజిదా పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయ్యినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. నయీంకు దూరపు బంధువు, వీఆర్వోవోగా పనిచేస్తున్న ఫయీంను తన ఉద్యోగానికి ఐదేండ్ల క్రితం రాజీనామా చేయించి సాజిదాతో వివాహం జరిపించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

ఛత్తీస్‌గఢ్ డెన్‌కు రాష్ట్రానికి చెందిన పలువురు పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లే వారని సాజిదా బయటపెట్టినట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో రూ.65 లక్షల విలువైన ఇెసిసప, 11 వాహనాలు, 200 వరకు భూ పత్రాలు ఉన్నాయని సాజిదా తెలిపినట్టు పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి.

మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు ప్రస్తుతం కస్టడీలో ఉన్న సాజిదాను ఛత్తీస్‌గఢ్ తీసుకెళ్లనున్నట్టు సమాచారం. అత్యంత నమ్మకస్తుడైన ఫయీంను సెల్‌ఫోన్ వాడనిచ్చే వాడు కాదని తెలిసింది. సాజిదాను, ఫయీంను వేర్వేరుగా ఉంచే వాడని, ఒకరిని ఛత్తీస్‌గఢ్‌లో, మరొకరిని గోవాలో పెట్టేవాడని విచారణలో బయటపడింది. సాజిదాను కలుసుకోవడానికి ఫయీం ప్రయత్నిస్తే చంపివేస్తానని నయీం బెదిరించే వాడని ఫయీం దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచార.

ఫయీం వెల్లడించిన సమాచారం ఆధారంగా గురువారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని రోషన్ కాలనీలో షేక్ ఫయాజ్ నివాసంలో శంషాబాద్ జోన్ పోలీసులు సోదాలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది. ఈ సోదాల్లో ద్విచక్ర వాహనం, భూముల పత్రాలున్న రెండు బ్యాగులను స్వాధీనం చేసుకొన్నారు.

ఈ నెల 18న అదుపులోకి తీసుకొన్న షేక్ ఫయాజ్‌ను రిమాండ్‌కు తరలించారు. నయీం గ్యాంగ్‌లో ఫయాజ్ కీలకవ్యక్తి కావడంతో విచారణ అంశాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గురువారం నయీం బాధితుడు, భువనగిరికి చెందిన ఎలక్ట్రికల్ వ్యాపారి చంచు నరహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనను బెదిరించి రూ.25 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదులో వెల్లడించారు. భువనగిరిలో ఓ ఇంటి నిర్మాణం చేపడుతుండగా నయీం అనుచరులు పాశం శ్రీను, బచ్చు నాగరాజు తనను కిడ్నాప్ చేసి నయీం డెన్‌కు తరలించారని నరహరి ఆరోపించాడు. తొలుత రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా, అంత డబ్బు ఇవ్వలేనని వేడుకోవడంతో చివరకు రూ.25 చెల్లించే ఒప్పందం కుదిరిందన్నారు. ఆ మొత్తాన్ని నయీం అనుచరుడు పులిరాజుకు అందజేశానని చెప్పారు.

రెండురోజుల వయస్సు ఉన్న పసికందు నుంచి 16 ఏండ్ల బాలికలను నయీం కొనుగోలు చేసేవాడని, వారిని ఒంగోలు, ఛత్తీస్‌గఢ్, గోవాలోని తన డెన్‌లో పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. నయీం బయటకు వెళ్లే సమయంలో చిన్నపిల్లలను వాహనంలో తీసుకెళ్లడం, వారి వద్ద పిస్టల్స్ దాచిపెట్టి వారిందరినీ సేఫ్‌కీపర్స్‌గా ఉపయోగించుకున్నాడని తెలిస్తోందంటూ మీడియా వార్తాకథనాల సారాంశం.

English summary
Killed gangester Nayeem had a den at Ongole in Prakasam district of Andhra Pradesh and sexually assaulted 30 girls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X