నయీం అంతం: అచ్చం మహేష్ బాబు సినిమాల్లో లాగే...

హైదరాబాద్‌: గ్యాంగస్టర్ నయీమ్‌ను పోలీసులు అచ్చం మహేష్ బాబు సినిమాలో మాదిరిగానే హతం చేశారనే మాట వినిపిస్తోంది. బహుశా పోకిరి సినిమా అయి ఉంటుంది. మాఫియా లీడర్‌తో సంబంధాలు పెట్టుకున్న ఓ పోలీసు ఆఫీసర్‌ను హీరో మహేష్ బాబు ఆడుకుంటాడు. ఆ పోలీసు ఆఫీసర్‌తో హీరో మహేష్ బాబు ఓ నిర్దేశిత ప్రాంతానికి రప్పించి మాఫియా లీడర్‌పై దాడి చేస్తాడు.

అయితే, అది సినిమా కాబట్టి హీరో ఒక్కడే వెళ్లాడు. ఇక్కడ గ్రేహౌండ్స్ బలగాలు వెళ్లి నయీమ్‌ స్థావరంపై దాడి చేశాయి. డీల్ కోసం ప్రత్యర్థులను పిలిపించి హతమార్చడం, బెదిరించడం వంటి పనులకు నయీమ్ పూనుకునేవాడని అంటారు. నయీం కోసం ఆపరేషన్ ప్రారంభించిన విషయాన్ని నమ్మకస్తులైన పోలీసులకు తెలుసునని, వారు నయీమ్‌కు ఆ విషయం చెప్పారని అంటారు.

దాంతోనే నయీమ్ స్థావరాలు మారుస్తూ వస్తున్న క్రమంలో పోలీసులు తెలివిగా వ్యవహరించారని చెబుతున్నారు. పోలీసుల వ్యూహంలో భాగంగానే నయీమ్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వచ్చాడని ప్రచారం సాగుతోంది. నయీమ్‌తో పరిచయం ఉన్న ఓ డిఎస్పీతో డీల్ చేద్దామంటూ కబురు పెట్టించారని, ఆ సమయంలో నయీం నగరంలో గానీ షాద్‌నగర్‌లో గానీ లేడని అంటున్నారు.

nayeem has been traced in like Mahesh babu's film

డిఎస్పీతో ఉన్న చనువు కారణంగా, కోట్ల రూపాయల డీల్ ఆశపెట్టిన కారణంగా నయీం షాద్‌నగర్ వచ్చాడని అంటున్నారు. సోమవారం సెటిల్‌మెంట్ ఉందని నయీంతో డిఎస్పీ చెప్పాడని అంటున్నారు. దాంతో శనివారం రాత్రి నయీం షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్ చేరుకున్నట్లు తెలుస్తోంది.

మఫ్టీ పోలీసులు నయీమ్ రాకను ధ్రువీకరించిన తర్వాత శనివారం రాత్రే నయీంను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధపడ్డారని సమాచారం. అయితే, మర్నాడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఉండడంతో ఆపరేషన్‌ను ఒక రోజు వాయిదా వేసినట్లు చెబుతున్నారు.

శనివారం నుంచి ఆదివారం ఆర్థరాత్రి వరకు పోలీసులు కాపు గాిస తెల్లవారు జామున గ్రే హౌండ్స్ బలగాలతో నయీం స్థావరంపై దాడి చేసినట్లు చెబుతున్నారు. వారిని గమనించిన నయీమ్ పారిపోయేందుకు ప్రయత్నించాడదని, నయీం గన్‌మన్ కాల్పులు జరిపాడని అంటున్నారు. అయితే, పోలీసులు పకడ్బందీగా వ్యవహరించడంతో నయీమ్ తప్పించుకోలేకపోయాడని, ఎదురు కాల్పుల్లో మరణించాడని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+