హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుష్మా చొరవతో విముక్తి: సాయి శ్రీనివాస్ కిడ్నాప్‌పై వీడని మిస్టరీ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉద్యోగం కోసం ఘనా (ఆఫ్రికా)కు వెళ్లి నైజీరియా పోలీసులకు చిక్కి 2014 నుంచి బందీగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేటకు చెందిన మనోజ్ కుమార్‌ విడదలయ్యాడు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో మొత్తం 10 మంది భారతీయులను అక్కడి పోలీసులు విడుదల చేశారు.

దీంతో మనోజ్ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీరందరిని ఆదివారం మధ్యాహ్నాం ఢిల్లీ నుంచి వారి వారి స్వస్థలాలకు విదేశాంగ అధికారులు పంపించి వేశారు. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన దుస్తులు వ్యాపారి దశరథ్ కుమారుడైన మనోజ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆఫ్రాకాలోని ఘానాలో ఓ ఆయిల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

ఓడల మరమ్మత్తులో పరిజ్ఞానం ఉండటంతో తాను ఉద్యోగం పొందిన కంపెనీ మంచి వేతనాన్నే ఆఫర్ చేసింది. 2014 ఏప్రిల్‌లో కంపెనీకి చెందిన పాత ఓడ తరచూ పాడవుతుండటంతో అమ్మి రావాలంటూ మనోజ్ సహా భారత్‌కు చెందిన 11 మంది యువ ఇంజనీర్లను కామెరూన్ దేశానికి పంపారు.

వీరు వెళుతున్న ఓడ మార్గం మధ్యలో పాడవటంతో నెల రోజులు సముద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో నైజీరియా దేశ సరహద్దు ప్రాంతంలో తీర గస్తీ దళం వీరిని అదుపులోకి తీసుకుంది. దీంతో సుష్మా చొరవతో నైజీరియా పోలీసులు వీరిని విడుదల చేశారు.

మరోవైపు నైజీరియాలోని జిబొకులో అపహరణకు గురైన ఎం. సాయిశ్రీనివాసం మిస్టరీ ఈరోజుకీ వీడకపోవడంతో అతని భార్య లలిత, కుమారుడు, కుమార్తె ఇతర కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. కిడ్నాపర్ల నుంచి గత ఐదు రోజులుగా ఫోన్ కూడా రాకపోవడంతో వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే సాయిశ్రీనివాస్, అతని తోటి ఉద్యోగి అనీశ్ శర్మను గత నెల 29న కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఏపీకి చెందిన సాయి శ్రీనివాస్, కోల్‌కత్తాకు చెందిన అనీశ్ శర్మను విడిపించడానికి ప్రయత్నిస్తామని ఆమె ఆదివారం పేర్కొన్నారు.

సాయిశ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన సాయిశ్రీనివాస్‌ కుటుంబాన్ని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. సాయి శ్రీనివాస్‌ను తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని మంత్రి పల్లె పేర్కొన్నారు.

నైజీరియాలో విదేశీయులకు రక్షణ లేదు: మనోజ్ కుమార్
నైజీరియా జైలు నుంచి విడుదలైన మనోజ్ కుమార్ సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ నైజీరియాలో విదేశీయులకు రక్షణ లేదని పేర్కొన్నారు.

పిష్‌లో పెట్రోల్ అక్రమ రవాణా పేరుతో తమపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టిందని చెప్పిన అతడు తమను అన్యాయంగా 23 నెలలు జైలులో ఉంచిందన్నారు. తమపై పెట్టిన ఆరోపణలు నిరాధారం కావడంతోనే తమను జైలు నుంచి విడుదల చేశారని పేర్కొన్నారు.

తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నైజీరియాలో భారతీయల పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. తమ 11 మందితో పాటు అక్కడి జైళ్లో ఇంకో ఇద్దరు మగ్గుతున్నారని, త్వరలోనే వారు కూడా విడుదలవుతారని అతడు పేర్కొన్నాడు.

నైజీరియాలో స్థిరపడ్డ నితినీ సందేశ్ అనే వ్యాపారివేత్త జోక్యంతో తామంతా బయటపడినట్లు అతడు పేర్కొన్నాడు. ఉద్యోగం నిమిత్తం మళ్లీ నైజీరియా వెళ్లాలని తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అతడు పేర్కొన్నాడు, మనోజ్ కుమార్ తిరిగి క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

English summary
India is making all efforts to secure the release of two Indians abducted from Gboko, a town in the Benue state of north-central Nigeria, External Affairs Minister Sushma Swaraj said on Sunday.The Minister also thanked Indian envoy in Abuja for repatriation of 11 Indians, who were released after languishing in a Nigerian jail for two years. "I appreciate the efforts of our High Commissioner in Nigeria Shri BN Reddy for expediting their repatriation," Swaraj tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X