ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో దాదాపు 33 లక్షల మందికి షాక్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తాజాగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో అర్హులైన లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయడానికి ఏర్పాటు చేస్తున్న అధికార యంత్రాంగం తాజాగా రాష్ట్రంలో 32.98 లక్షల మందికి ఇల్లు రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది.

ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై కీలక నిర్ణయం
ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రద్దు ఆలోచన ఎందుకు చేస్తుంది? ఎవరి ఇళ్లను రద్దు చేయడానికి నిర్ణయించింది? అన్న వివరాల్లోకి వెళితే..తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిరుపేదలైన అర్హులకు ఇళ్లను మంజూరు చేయడానికి నిర్ణయించింది.

Nearly 33 lakh people have received a shock under the Indiramma housing scheme

Take a Poll

ఇందిరమ్మ ఇళ్ళ కోసం దాదాపు 78లక్షల దరఖాస్తులు
ఈ పథకంలో భాగంగా ఏడాదికి 4 లక్షల 50 వేల ఇళ్ల చొప్పున రెండు సంవత్సరాలలో మొత్తం తొమ్మిది లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 77 లక్షల 68 వేల 134 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా వీటిని నిశితంగా పరిశీలించి మూడు వర్గాలుగా విభజించింది.

ఎల్ 1 జాబితాలో దరఖాస్తులు ఇలా
ఎల్ వన్ జాబితాలో సొంత స్థలం నుండి నివసించడానికి ఇల్లు లేని అత్యంత నిరుపేదలను చేర్చింది. ఈ విభాగంలో 23 లక్షల 20 వేల 490మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాబోయే రెండేళ్లలో ఇళ్ళ కేటాయింపుల ద్వారా 13.50లక్షలు మందికి లబ్ధి చేకూరుతుంది. మిగిలిన 9.70లక్షల మందికి తదుపరి దశలలో అవకాశం కల్పిస్తారు. ఇక మరోవైపు ఇల్లు, సొంత స్థలం రెండు లేని నిరుపేదలను ఎల్ టు జాబితాలో చేర్చారు.

వీరిని అనర్హులుగా గుర్తించిన తెలంగాణా సర్కార్
వీరి సంఖ్య సుమారు 21.49 లక్షలుగా ఉంది. వీరికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల నిర్మాణ సాయం పైన ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్లాక్ ల వారీగా ఇళ్ళ నిర్మాణం పై కూడా అధికారులు ఆలోచనలో ఉన్నారు. ఇక ఎల్ 3 జాబితాలో ఆదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారు ఉన్నారు. వీరంతా అనర్హులుగా గుర్తించబడ్డారు.

ఈ అనర్హుల జాబితాలో 32. 98 లక్షల మంది
ఈ జాబితాలో సుమారు 32. 98 లక్షల మంది ఉన్నారు. అయితే వీరందరికీ ఇల్లు కేటాయింపును రద్దు చేయాలని ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. నిజమైన నిరుపేదలకు పారదర్శకమైన విధానంలో ఇల్లు ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం ఎల్3 జాబితాలో ఉన్న వారికి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+