హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక మాటలు బంద్, చేతలే: కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ‘ఇక మాటలు బంద్. పనులు జరగాలి. ఎన్ని నిధులు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధం. ఒకరిపై ఒకరు నిందలు వద్దు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం' అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై రాజధాని నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సిఎం కెసిఆర్ మంగళవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.

‘ఇంకా నిర్లక్ష్యం చేస్తే నగరం మన చేతిలో ఉండదు.బాగు చేద్దామన్నా చేసుకోలేని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. వెంటనే చర్యలు చేపట్టి జాగ్రత్త పడదాం' అని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా ఒక అడుగు ముందుకు వేశామని, అందరం కలిసి పార్టీలకు అతీతంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామన్నారు. నిధులకు కొరత లేదని, కేంద్రం సహకారానికీ ప్రయత్నిస్తామని తెలిపారు. ‘ఏం చేద్దామో చెప్పండి' అని ప్రజాప్రతినిధులను అడిగారు.

హైదరాబాద్‌లో 390 కిలో మీటర్ల పొడవైన 72 నాలాల పరిస్థితి బాగాలేదని అన్నారు. వర్షపు నీరు పోవలసిన నాలాలలో మురికి నీరు ప్రవహిస్తోందని, నాలాలలపైన, నీళ్లలో కూడా కట్టడాలు వచ్చాయని, వీటిని సరి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పారిశుద్ధ్య పరిస్థితి బాగాలేదని, ప్రతిరోజు నాలుగు వేల మెట్రిక్ టన్నుల చెత్త తయారవుతోందన్నారు. చెత్తను ఏరివేయడంతో పాటు శిథిలాల తొలగింపుముఖ్యమని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

‘ఇక మాటలు బంద్. పనులు జరగాలి. ఎన్ని నిధులు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధం. ఒకరిపై ఒకరు నిందలు వద్దు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం' అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

కెసిఆర్

కెసిఆర్

స్వచ్ఛ హైదరాబాద్‌పై రాజధాని నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సిఎం కెసిఆర్ మంగళవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.

కెసిఆర్

కెసిఆర్

‘ఇంకా నిర్లక్ష్యం చేస్తే నగరం మన చేతిలో ఉండదు.బాగు చేద్దామన్నా చేసుకోలేని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. వెంటనే చర్యలు చేపట్టి జాగ్రత్త పడదాం' అని ముఖ్యమంత్రి సూచించారు.

కెసిఆర్

కెసిఆర్

స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా ఒక అడుగు ముందుకు వేశామని, అందరం కలిసి పార్టీలకు అతీతంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

నిధులకు కొరత లేదని, కేంద్రం సహకారానికీ ప్రయత్నిస్తామని తెలిపారు. ‘ఏం చేద్దామో చెప్పండి' అని ప్రజాప్రతినిధులను అడిగారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్‌లో 390 కిలో మీటర్ల పొడవైన 72 నాలాల పరిస్థితి బాగాలేదని అన్నారు. వర్షపు నీరు పోవలసిన నాలాలలో మురికి నీరు ప్రవహిస్తోందని, నాలాలలపైన, నీళ్లలో కూడా కట్టడాలు వచ్చాయని, వీటిని సరి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

చాలా బస్తీల గుండా హైటెన్షన్ వైర్లు పోతున్నాయని, దీని వల్ల ప్రాణ నష్టం జరుగుతోందని తెలిపారు. పాత బస్తీలోనూ, మరి కొన్ని చోట్ల లో ఓల్టేజి సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. చాలా చోట్ల మురికి నీరు, మంచినీరు కలిసి పోతున్నవని, వీటన్నిటి పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడి దారులు హైదరాబాద్ వైపు చూస్తున్నారని తెలిపారు.

నగరానికి నాలుగు వైపులా 50 కిలో మీటర్ల అవతల డంప్ యార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ అంశాలపై ప్రజాప్రతినిధులు పలు సలహాలు ఇచ్చారు. ఢిల్లీ, నాగపూర్‌లో వ్యర్థాల నిర్వహణ కోసం అవలంభిస్తున్న పద్దతులు చూసి రావడానికి జిహెచ్‌ఎంసి ప్రజాప్రతినిధుల బృందాన్ని పంపాలని నిర్ణయించారు. సమస్యలున్నాయి, వాటిని చూసి భయపడవద్దని, ఇప్పుడు మొదలు పెట్టాం, సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు.

హైదరాబాద్ నగర ప్రజలకు రోజుకు 602 ఎంజిడిల నీరు అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 385 ఎంజిడిలు వస్తున్నాయి. కృష్ణా నుంచి 45, గోదావర నుంచి 72 ఎంజిడిల నీరు త్వరలో నగరానికి వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. అయినా ఇంకా నీటి కొరత ఉందని, నగరంలో 20 లక్షల ఇళ్లు ఉంటే అందులో 14లక్షల కుటుంబాలకు నల్లా ద్వారా మంచినీరు లభిస్తుందని తెలిపారు.

English summary
As part of the `Clean Hyderabad' drive, four scientifically-managed dump yards will be set up in different corners of the city soon. The four new dump yards will be located at a distance of about 50 km from the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X