సమస్యల పట్ల వేగంగా స్పందించాలి.!గ్రీవెన్స్ సెల్ సమీక్షా సమావేశంలో స్టీఫెన్ రవీంద్ర.!
హైదరాబాద్ : పోలీసులు ప్రభుత్వానికే కాకుండా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటే ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేసారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లో వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాదికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని అధికారులకు సూచించారు. ప్రజలకు పోలీసుల పట్ల ఉన్న భయం తొలగంచి, స్నేహపూర్వక వాతావరణం కోసం ప్రయత్నించాలని సూచించారు.

సమస్యల వేగవంతమైన పరిష్కారం.. గ్రీవెన్స్ సెల్ అందుకే ఉందన్న సైబరాబాద్ సీపీ
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితో గురువారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. ఉన్నతాదికారులకు పలు సూచనలు చేసారు. అంతే కాకుండా పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసిన విషయం విధితమేనన్నారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర.

ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి.. అప్పుడే గౌరవం పురుగుతుందన్ని సీపీ
కాగా గురువారం నిర్వహించిన సమావేశం 12వ గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశమని, సిబ్బంది నుంచి గ్రీవెన్స్ సెల్ కు మంచి స్పందన వస్తుందన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. గురువారం ముఖ్యంగా హెచ్ఆర్ఎమ్ఎస్, సినిమాటోగ్రఫీ పర్మిషన్లు, ఈవెంట్ పర్మిషన్లు, పెట్రోలియం పర్మిషన్లు తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు.

ఏఆర్ పోలీసు సిబ్బంది పని భారం తగ్గించాలి.. అదనంగా గార్డులను నియమించాలన్న సీపి
హెచ్ఆర్ఎమ్ఎస్ అప్లికేషన్ వినియోగంపై సిబ్బందికి అవగాహన పెంచాలన్నారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్. ఏఆర్ పోలీసు సిబ్బంది గార్డులను పెంచి వారి పని భారాన్ని తగ్గించాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల పరస్పర బదిలీ ప్రక్రియలో భాగంగా డీసీపీ అడ్మిన్ల నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బంది నుంచి ఆప్షన్లు స్వీకరిస్తామన్నారు. సీఏఓ లు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు సీపి.

సమస్యలతో కృంగిపోవద్దు.. గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేయాలన్న స్టీఫెన్ రవీంద్ర
సిబ్బందికి సమస్యలుంటే గ్రీవెన్స్ సెల్ (83339 93272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు సీపి. ఈ సమావేశంలో సైబరాబాద్ శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ఐపీఎస్., విమెన్& చిల్డ్రన్ సేఫ్టీవింగ్ డీసీపీ శ్రీమతి అనసూయ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సిఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, సీఎస్డబ్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ శంకర్, ఏసీపీలు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.