పర్యాటకులకు నెహ్రూ జూపార్క్ షాక్..
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ పర్యాటకలకు భారీ షాక్ ఇవ్వనుంది. జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మార్చి 1వ తేదీన నుంచి జూ పార్క్ లో అన్ని రకాల టికట్ ధరలను పెంచానున్నట్టు ప్రకటించారు.
టికెట్ రేట్లు పెంపు..
గతంలో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.45గా ఎంట్రీ టికెట్ ఉండేది. మార్చి 1 నుంచి పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. అలానే ఫోటో కెమెరా అనుమతికి రూ.150, వీడియో కెమెరాకు రూ.2500, కమర్షియల్ మూవీ షూటింగ్ కోసం రూ.10 వేలు ఛార్జి చేయనున్నట్టు స్పష్టం చేశారు. ట్రైన్ రైడ్ 20 నిమిషాలకు పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40లుగా నిర్ణయించారు.

ఇక బ్యాటరీ ఆపరేటెడ్ అయితే పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున వసూలు చేయనున్నారు. సఫారి పార్కు డ్రైవ్ సీఎన్‌జీ బస్ 20 నిమిషాలకు ఏసీ రూ.150, నాన్ ఏసీ రూ.100 చొప్పున వసూలు చేయనున్నారు. 11 సీట్లు గల న్యూ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్‌లో 60 నిమిషాలపాటు షికారు చేస్తే రూ.3,000, 14 సీట్ల బీఓవీ ఎక్స్‌క్లూజివ్ వాహనంలో కలియ తిరిగితే రూ.4,000 వసూలు చేస్తారు.
అంతే కాకుండా నెహ్రూ జూ పార్క్‌లోని పార్కింగ్ ఫీజు కూడా పెంచారు. సైకిల్‌కు రూ.10, బైక్‌కు రూ.30, ఆటోకు రూ.80, కారు/జీప్ రూ.100 వసూలు చేయనున్నారు. టెంపో, తుఫాన్ వాహనానికి రూ.150, 21 సీట్లు ఉన్న మినీ బస్సుకు రూ.200, 21 సీట్లు పైగా ఉన్న బస్సుకు రూ.300 చొప్పున పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications