కర్ణాటకకు తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు
పొరుగింటి యువకుడు అజ్మతుల్లా (22) 13 ఏళ్ల బాలికను కర్ణాటకకు తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెప్పారు.
హైదరాబాద్: పొరుగింటి యువకుడు అజ్మతుల్లా (22) 13 ఏళ్ల బాలికను కర్ణాటకకు తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెప్పారు.
నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని బాలాపూర్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక ఇంటి పక్కనే నిందితుడి కుటుంబం కూడా ఉంటుంది.
ఇరువురి తండ్రులు కూడా ఆటో డ్రైవర్లు, సన్నిహిత మిత్రులు. దాన్ని ఆసరా చేసుకుని యువకుడు బాలికతో పరిచయం పెంచుకున్నాడు.

ప్రేమిస్తున్నానని నమ్మించి....
తాను ప్రేమిస్తున్నానని నిందితుడు అజ్మతుల్లా బాలికను నమ్మించాడు. దాంతో బాలిక అతని వలలో పడింది. కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తన కూతురిని యువకుడు వలలో వేసుకున్నాడని బాధితురాలి తల్లి అంటోంది. సంబంధం పెట్టుకున్న తర్వాత ఆ విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరిస్తూ వచ్చాడని చెబుతోంది. దీంతో బాలిక విషయాన్ని దాచి ఉంచిందని చెప్ింది
Recommended Video


బయటకు పిలిచి....
గత బుధవారంనాడు నిందితుడు బాలికను బయటకు పిలిచి, బీదర్ తీసుకుని వెళ్లాడని, అక్కడ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తున్నారు. బాలిక తీవ్రంగా నిరోధించడంతో శుక్రవారం తీసుకుని వచ్చి ఇంటి వద్ద దింపాడని చెబుతున్నారు.

గాలింపు చేపట్టారు...
బుధవారం నుంచి తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గాలించడం ప్రారంభించారు. తన కుమారుడు కూడా కనిపించకపోవడంతో నిందితుడి తండ్రి కూడా వారితో గాలింపులో పాల్గొన్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

షాక్‌కు గురైన బాలిక....
తీవ్రమైన షాక్‌కు గురైన బాలిక విషయాలను పూర్తి చెప్పలేకపోతోందని అంటున్నారు. అజ్మతుల్లాపై పోలీసులు కిడ్నాప్, అత్యాచారం కింద కేసులు పెట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications