వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీ పర్యవేక్షణలో తెల్లవార్లు చిత్రహింసలు: హోంమంత్రి ‘నాయిని’పై నేరేళ్ల బాధితుల ఫైర్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడు నెలల కింద నేరెళ్లలో ఇసుకలారీ కిందపడి ఓ గిరిజనుడు చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఊరి ప్రజలంతా ఒక్కటై ఇసుక లారీలను దహనం చేశారు. ఆ సమయంలో లాఠీచార్జీ చేసిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. అది జరిగిన తర్వాత రెండు రోజులకు పోలీసులు మప్టీలో వచ్చి ఎనిమిదిమందిని తీసుకెళ్లి.. వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. అటు పిమ్మట రిమాండ్‌పై జైలుకు పంపిన నేపథ్యంలో అసలు సంగతి బయటపడింది. వారి ఒంటిపై ఉన్న గాయాలను గమనించి జైలు సూపరింటెండెంట్‌ వెనక్కి పంపడం, తప్పని పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేర్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

దీనిపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సైతం నిందితులందరికి ఒకేచోట గాయాలెలా అయ్యాయి? అని సంధించిన ప్రశ్నకు సర్కార్ నుంచి సరైన జవాబే కొరవడింది. ఈ అంశం సీరియస్ కావడంతో విపక్షాలు, ప్రజాసంఘాలు భారీగా ఆందోళనకు దిగాయి.

 వెలుగు చూడని దర్యాప్తు సంస్థల విచారణ నివేదికలు

వెలుగు చూడని దర్యాప్తు సంస్థల విచారణ నివేదికలు

వివిధ పార్టీల జాతీయ స్థాయి నాయకులు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ సైతం వారిని పరామర్శించారు. మీరా కుమార్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహణకు టీపీసీసీ ప్రయత్నాలు చేసినా అనుమతి నిరాకరించిన గొప్ప నేపథ్యం తెలంగాణ ప్రభుత్వానిది. అయినా కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నేరెళ్ల బాధితులను పరామర్శించారు. తర్వాత నేరెళ్లలోని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నేరెళ్ల ఘటనపై జాతీయస్థాయిలో చర్చనీయాంశం కావడంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ, డీఐజీలతో విచారణనూ జరిపించిందిది. మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్పీ కమిషన్‌ కూడా బహిరంగ విచారణ జరిపింది. కానీ ఈ విచారణల నివేదికలను ప్రభుత్వం ఇప్పటివరకూ బయటపెట్టడం లేదు.

నాయిని

నాయిని

కానీ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తాజాగా 'వారికి ఉన్నవన్నీ పాతరోగాలే. పోలీసులు కొట్టలేదు' అంటూ శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమకు ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోతే జైలర్ ఎందుకు జైలులోకి అనుమతించలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్‌ ఆస్పత్రిలో పోలీసులు ఎందుకు వైద్యం చేయించారు? ఘటనలో బాధ్యుని చేస్తూ సీసీఎస్‌ ఎస్‌ఐని ఎందుకు సస్పెండ్‌ చేశారు? అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.

 విధిలేక పోలీసులు మమ్మల్ని దవాఖానలో చేర్చలేదా?

విధిలేక పోలీసులు మమ్మల్ని దవాఖానలో చేర్చలేదా?

బాధితులపై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు అందుకు సంబంధించిన కారణాలనూ ఎందుకు వెల్లడించట్లేదని నిలదీస్తున్నారు. ఆదుకోవాల్సిన సర్కారే ఇలా అవమానాల పాల్జేస్తోందని వాపోయారు. తమకు తగిలిన దెబ్బలు చూసిన జైలర్‌ తమను అనుమతించలేదు. దీంతో విధిలేక పోలీసులు మమ్మల్ని దవాఖానాలో చేర్చారు. ఈ విషయాలన్నీ నిజం కాదా? ఇంత జరిగినా మాకు పాతరోగాలు ఉన్నాయని అవమానించడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.

 జాతీయ కమిషన్ విచారణలో పోలీసులు దోషులుగా నిలబడలేదా?

జాతీయ కమిషన్ విచారణలో పోలీసులు దోషులుగా నిలబడలేదా?

ఎస్పీ ప్రత్యక్షంగా ఉండి మరీ ఎస్‌ఐ, కానిస్టేబుళ్లతో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారేదాకా చావబాదించాడని బాధితుడు పసుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదని, తమకు పాతరోగాలేమీ లేవు. ఉంటే తమ ఆరుగురికీ ఒకే చోట ఉంటాయా?
జైలర్‌ వెనక్కి పంపింది నిజం కాదా అని పసుల ఈశ్వర్‌ నిలదీశారు. మరో బాధితుడు గంధం గోపాల్ మాట్లాడుతూ ‘అనారోగ్యమే అయితే అందరికీ ఒకే రోగం ఉంటుందా?. ఇసుక లారీల దహనం కేసులో దొంగల్లా మమల్ని లాక్కెళ్లి చావబాదారు. ఈ విషయమై లొల్లి లొల్లికాగానే జాతీయ కమిషన్‌ విచారణలో పోలీసులు దోషులుగా నిలబడ్డారు. ఇవన్నీ అవాస్తవాలేనా?' అని ఆందోళన వ్యక్తం చేశారు.

 విపక్షాలపై సీఎం కేసీఆర్ ఇలా ఎదురుదాడి

విపక్షాలపై సీఎం కేసీఆర్ ఇలా ఎదురుదాడి

'పోలీసుల చావుదెబ్బలకు బతుకుజీవుడా అంటూ బయటపడిన మేము పాతరోగాలతో బాధపడుతున్నామా? ఇంత అవివేకంగా మాట్లాడిన హోంమంత్రి అదే మాటను ప్రజాక్షేత్రంలో చెప్పాలి. ఇవి పాతరోగాలా? లేక పోలీసుల చావుదెబ్బలా?అనేది తేలుతుంది' అని నేరెళ్ల బాధితుడు పెంట బానయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో దీనిపై సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ నేరెళ్ల ఘటనలో బాధితులంతా దళితులే కాదని, విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు. గమ్మత్తేమిటంటే నేరెళ్ల.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉండటమే.

English summary
Nerella victims objected Telangana Home Minister Nayini Narsimha Reddy comments. Recently Nayini Narsimha Reddy said in State legistative council that Nerella victims had old health issues, police didn't torture them. These comments are gets protest from victims. They are asking Nayini.. "if we had old health issues, why jailor didn't allow to jail. why police admitted in government hospital in Karimnagar?".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X