న్యూ కోవిడ్ స్ట్రెయిన్... అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లను గుర్తించే పనిలో...
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్(న్యూ కోవిడ్ స్ట్రెయిన్) వెలుగుచూడటం... అత్యంత వేగంగా ఆ వైరస్ విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. భారత్ సహా ఇప్పటికే పలు దేశాలు బ్రిటన్‌కు విమాన సర్వీసులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా న్యూ కోవిడ్ స్ట్రెయిన్ పట్ల అప్రమత్తమైంది.
గత వారం రోజుల్లో బ్రిటన్ నుంచి తెలంగాణకు తిరిగొచ్చినవాళ్లను గుర్తించే పనిలో పడింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా సర్వైలైన్స్ ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్‌గా నిర్దారణ అయితే ఆస్పత్రికి తరలిస్తారు.నెగటివ్‌గా తేలితే వారం రోజుల పాటు క్వారెంటైన్‌కు పంపిస్తారు. కొత్త రకం వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తదనుగుణంగా చర్యలకు సిద్దమవుతోంది.

కొత్త కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముంబై సహా మహారాష్ట్రలోని అన్ని ప్రధాన నగరాల్లో డిసెంబర్ 22వ తేదీ నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీరోజూ రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ నియంత్రణలో లేదని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించడం ప్రపంచ దేశాలను అలజడికి గురిచేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ కంటే కొత్త వైరస్ 70శాతం వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచానికి మరో ముప్పు తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడిప్పుడే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో... ప్రపంచ దేశాలన్నీ కాస్త రిలాక్స్ అవుతున్న తరుణంలోనే కరోనా కొత్తగా రూపాంతరం చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకుకెనడా,ఆస్ట్రేలియా,ఫ్రాన్స్,జర్మనీ,ఆస్ట్రియా,ఇటలీ,హాంకాంగ్ తదితర దేశాలు ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిషేధించాయి.












Click it and Unblock the Notifications