• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ అక్కడ.. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన జాప్యంతో కొత్తచర్చ, కూసుకుంట్లకు టెన్షన్!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నికలలో ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతుంటే, టిఆర్ఎస్ మాత్రం జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలాబలాలను పరిశీలిస్తూ ప్రత్యర్థులను అంచనా వేసే పనిలో పడింది.

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన జాప్యం

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన జాప్యం


మునుగోడు ఉప ఎన్నికకు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించగా, టీఆర్‌ఎస్ మాత్రం ఆ ప్రకటనలో జాప్యం చేస్తూ విపక్షాలను అంచనా వేస్తోంది. ఇప్పటికే ఇద్దరు విపక్షాల అభ్యర్థులు బరిలోకి దిగిన తరుణంలో ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టి అధికార పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మునుగోడులో జెండా ఎగరెయ్యాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న టెన్షన్

అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న టెన్షన్

బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగగా, ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపింది. ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నా, కెసిఆర్ ఇంకా ప్రకటించలేదు కాబట్టి.. ఆయన ప్రకటించే వరకు అభ్యర్థి ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పలేమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ అని ప్రచారం .. అయినా కేసీఆర్ ప్రకటించాలి కదా అంటూ చర్చ

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ అని ప్రచారం .. అయినా కేసీఆర్ ప్రకటించాలి కదా అంటూ చర్చ

రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దాదాపు నెలన్నర కావస్తోంది.ఈసీ షెడ్యూల్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థిని ప్రకటించే ముందు పార్టీ వివిధ ఎంపికలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఇంధన శాఖ మంత్రి ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ, ఆయనకే టికెట్ రావాలని ప్రయత్నిస్తూ ఉండటం నియోజకవర్గంలోని ఇతర నాయకుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణంగా మారింది. జిల్లా నేతలు ఇప్పటికే ప్రగతి భవన్‌లో సీఎంతో ఒక రౌండ్‌ సమావేశమయ్యారు, అక్కడ అభ్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా హైకమాండ్ ఆదేశాలను అనుసరించి పార్టీ కోసం పని చేయాలని కోరారు.

ఇంకా పట్టుబడుతున్న బీసీ నేతలు..

ఇంకా పట్టుబడుతున్న బీసీ నేతలు..

నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉన్న బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు ఇంకా కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థికే బెటర్ అని జిల్లా పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో గౌడ్‌లు ఉండడంతో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఉపఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

అక్కడ కేసీఆర్ .. టికెట్ విషయంలో ఏమైనా జరగొచ్చు అన్న చర్చ

అక్కడ కేసీఆర్ .. టికెట్ విషయంలో ఏమైనా జరగొచ్చు అన్న చర్చ

మండలి చైర్మన్ జి. సుఖేందర్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కె.భూపాల్ రెడ్డి సోదరుడు కె.కృష్ణారెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కే టిక్కెట్టు అని బయట పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా, కెసిఆర్ ఫైనల్ గా ప్రకటించే వరకు అభ్యర్థి ఎవరు అన్నది పూర్తిగా నిర్ధారణ కాదని, అక్కడ నిర్ణయం తీసుకునేది కేసీఆర్ కాబట్టి, ఏదైనా జరగొచ్చు అని చర్చ జరుగుతుంది. ఇంకా తమకు అవకాశం ఇస్తారేమో అన్న ఆశలో బీసీ నాయకులు ఉంటే, ఇంకా ప్రకటన రాక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా టెన్షన్ లో ఉన్నారు.

English summary
A new debate will be held after the delay in the announcement of TRS candidate munugode. TRS leaders waiting for CM KCR announcement and they are discussing the kcr stratagies. This made the munugode ticket affair interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X