జిల్లాల పెంపు: ఛాన్స్ కొట్టేయనున్న జూనియర్ మంత్రులు
హైదరాబాద్: కొత్త జిల్లాలు ప్రజలకు సంతోషాన్ని తెచ్చిపెడితే.... మంత్రులకు కూడ కొత్త జిల్లాల ఇంచార్జ్ బాద్యతలను తెచ్చిపెట్టనున్నాయి.సీనియర్లతో పాటు జూనియర్ మంత్రులు కూడ జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులుగా వ్యవహారించనున్నారు.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎవరెవరినీ ఇంచార్జ్ లుగా నియమించాలనే దానిపై సిఎం కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 18 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో ఏర్పడింది. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ సర్కార్ మరో 21 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసంది. రాష్ట్ర మంత్రివర్గంలో కెసిఆర్ మినహాయించి 17 మంది మంత్రులున్నారు.వీరిలో సీనియర్లను ఆయా జిల్లాలకు ఇంచార్జ్ లుగా ప్రభుత్వం గతంలో నియమించింది.

అయితే ప్రస్తుతం జిల్లాల సంఖ్య 10 నుండి 31కు పెరిగింది.దీంతో ఆయా జిల్లాలకు ఇంచార్జ్ మంత్రుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఏర్పడింది సర్కార్ కు. సీనియర్ మంత్రులను రెండేసి జిల్లాలకు, జూనియర్ మంత్రులకు ఒక్క జిల్లా చొప్పున ఇంచార్జ్ భాద్యతలను కట్టబెట్టాలని సిఎం కెసిఆర్ యోచిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న జిల్లా ఇంచార్జ్ మంత్రులకు స్పెషల్ డెవలప్ మెంట్ నిధుల కేటాయింపు పద్దతిని కూడ మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల కింద ఖర్చు చేయనున్నారు. దీనికి తోడు మరో 10 కోట్లను అభివృద్ది పనుల కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నారు.10 జిల్లాల్లో ఈ తరహా పనుల నిర్వహాణ కోసం ప్రభుత్వం 100 కోట్లను మంజూరు చేసింది.ఇందులో ఇప్పటికే 25 కోటక్లను విడుదల చేసింది. మిగిలిన 75 కోట్లను ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాలతో కలిపి 31 జిల్లాలకు ఖర్చు చేయనున్నారు.ఈ మేరకు ప్రతి జిల్లాకు 2.40 కోట్లను ఖర్చు చేయాలని సర్కార్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications