కొత్త సచివాలయంపై వేగవంతం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం విషయమై వేగంపెంచింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న తడవు పాత సచివాలయాన్ని కూల్చి, దాని స్థానంలో నూతన సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం చూపుతుంది. దీనిలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సచివాలయం మొత్తాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం 10 రోజుల డెడ్ లైన్ కూడా విధించారు. అంతేకాదు, తొమ్మిది మంది ఐఏఎస్‌లకు సచివాలయం తరలింపు బాధ్యతలను అప్పగించారు.












Click it and Unblock the Notifications