యువతులను ఎరగా వేసి దోచుకొంటున్నారు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : అర్థరాత్రి ఓంటరిగా వెళ్ళేవారిని లక్ష్యంగా చేసుకొని కొందరు దోపిడిలకు పాల్పడుతున్నారు. వీరికి యువతులకు వల వేయడం, లేదా బెదిరించి వారి నుండి నగదును తీసుకొంటున్నారు.ఇప్పటికే ఒక్క ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలను పట్టుకొనేందుకు పోలీసులు నిఘాను పెంచారు.ఈ ముఠాల బారినపడినవారు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

హైద్రాబాద్ నగరంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఐటి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని కొందరు దోపిడిలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో యువతులను ఎరవేసి కూడ దోపిడిలు చేస్తున్నారు.

ఐటి ఉద్యోగులు రాత్రి పూట విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో రోడ్డుపై నిర్మానుష్య ప్రాంతంలో ఈ దోపిడిలకు ముఠాలు పాల్పడుతున్నాయని పోలీసులు గుర్తించారు.మాదాపూర్ లో ప్రాంతంలో యువతులతో ఎర వేసి దోపిడిలకు పాల్పడుతున్నారు.

new techniques for robbery, target it employees in cyber city

యువతులను ఎరవేసి వారితో బేరం కుదుర్చుకొనే సమయంలో ముఠాలోని సభ్యులు అక్కడికి చేరుకొని విటులతో గొడవకు దిగి వారి వద్ద ఉన్న డబ్బును, బంగారు వస్తువులను దొంగిలిస్తారు. ఇటీవల ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

విధులు ముగించుకొని ఇంటికి ఒంటరిగా వెళ్ళే ఉద్యోగులు లేదా ఇంకేవరైనా ఈ ముఠా కంటికి కన్పిస్తే చాలు నగదు, బంగారం ఆఖరికి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా షాపింగ్ చేస్తుంటారు. ఈ రకమైన ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని పోలీసులు గుర్తించారు. దోపిడికి గురైన వారు నిర్బయంగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ రమైన దోపిడిలకు పాల్పడే ముఠాను పోలీసులు గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
police identify some groups in cyberabad area , they target it employees, and also trap with ladies for money, recently in 2 weeks 10 cases booked, one group arrest by police, another two groups for searching .
Please Wait while comments are loading...