వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి, టీల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం: ఢిల్లీలో 8అంతస్తుల్లో తెలంగాణ భవన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎనిమిది అంతస్తుల్లో నూతన తెలంగాణ భవన్‌ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనపై ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దాదాపు ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త భవన్‌ను నిర్మాణానికి అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం ఉన్న ఎనిమిదంతస్తుల భవనంలానే తెలంగాణ భవన్‌ను కూడా ఎనిమిది అంతస్తులతో నిర్మించనున్నది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాల మేరకు పరిపాలనాభవనం,అతిథిగృహాలు, ఉద్యోగుల నివాస సముదాయంవంటివి ఒకే ప్రాంగణంలో నిర్మించాలని భావిస్తోంది. ఉమ్మడిగా ఉన్న భవన్ విభజన పూర్తయిన తర్వాత తెలంగాణకు లభించే స్థలవిస్తీర్ణాన్ని బట్టి ఈ నిర్మాణం జరుగుతుంది.

అతిథిగృహాల సముదాయంలో 50 సూట్లు,100 గదులు, భారీ సమావేశ హాలు ఉంటాయి. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు సమాచారం. కొత్తగా నిర్మించే భవన్‌పై ఇప్పటికే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డీడీఏ) వైస్‌చైర్మన్‌తో ఒకదఫా చర్చలు జరిగాయి. స్థలానికి సంబంధించి రెండు రాష్ర్టాల మధ్య పంపిణీ పూర్తికాగానే మరోమారు డీడీఏతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.

New Telangana Bhavan in New Delhi

ఢిల్లీ నడిబొడ్డున ఉన్న అశోకారోడ్డులో ప్రస్తుతం ఉమ్మడి భవన్ ఉండగా, దీనికి సమీపంలోనే తెలంగాణ ప్రభుత్వం కొత్త భవనాన్ని నిర్మించనుంది. ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా నిబంధన ప్రకారం మొత్తం ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించుకోడానికి డీడీఏ సూత్రరీత్యా అంగీకారం తెలిపింది.
పటౌడీ హౌస్‌కు సంబంధించి రెండు రాష్ర్టాల మధ్య పంపిణీ ప్రక్రియ పూర్తికాగానే ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను డీడీఏకు సమర్పించడంతో రెసిడెన్షియల్ కేటగిరీనుంచి ఇన్‌స్టిట్యూషనల్ కేటగిరీకి మార్పు జరుగుతుందని అంటున్నారు.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకంగా భవన్ ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం వీలైనంత త్వరగా భవన్ నిర్మించాలని భావిస్తోంది. వీలైతే రానున్న బడ్జెట్‌లోనే దీని ప్రస్తావన చేయనున్నట్లు సమాచారం.

సామాన్యులు సైతం బస చేయడానికి వీలుగా తక్కువ అద్దెతో గదులు, డార్మెట్రీలు పొందే సౌకర్యాన్నీ నూతన భవన్‌లో కల్పించనున్నారు. వీరికోసం తెలంగాణ రుచులతో క్యాంటీన్ కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి చివరికి ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజన ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ వెంటనే నూతన భవన్‌పై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయి.

English summary
New Telangana Bhavan will established by Telangana Government in New Delhi soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X