కిడ్నాప్‌లో కొత్త కోణం: కిడ్నాపర్‌తో కలిసి భార్య డ్రామా, ఆ చిత్రాలు వట్టివే
హైదరాబాద్: భాగ్యనగరంలో అరెస్టైన మహిళ కిడ్నాప్ కేసులో కొత్త కోణం. కిడ్నాప్ అయిన మహిళ, కిడ్నాపర్ కలిసి ఈ నాటకం ఆడారని పోలీసులు వెల్లడించారు. సోమవారం నాడు పోలీసులు మీడియాతో వివరాలను తెలిపారు.
రాజేంద్ర నగర్ మహిళ కిడ్నాప్ మిస్టరీ వీడిందని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తితో మహిళనే వెళ్లిపోయిందని తెలిపారు. అలా తెలియని వ్యక్తితో పోవడం సరికాదన్నారు.
మహిళ, కిడ్నాపర్ కలిసి కిడ్నాప్ డ్రామా ఆడారని చెప్పారు. డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా ఆడారన్నారు. రక్తం, గాయాలు అంతా డ్రామానే అని చెప్పారు. కిడ్నాపర్‌గా చెప్పిన వ్యక్తి తనకు బదులు సోషల్ వెబ్ సైట్లో మరొక ఫోటో పెట్టాడన్నారు.
కొద్ది రోజుల తర్వాత ఆమె అతనితో కలిసి వెళ్లిందన్నారు. అతనిని మొదటిసారి చూసి షాకైందని, అయినప్పటికీ వెళ్లిందని చెప్పారు. నిందితులను కోల్‌కతాలో పట్టుకున్నామని చెప్పారు. సోషల్ సైట్లలో ఫోటోలు చూసి అమ్మాయిలు మోసబోతున్నారని చెప్పారు.

తనను భర్త సరిగా చూసుకోనందునే అలా చేశానని మహిళ చెబుతోందని, కానీ ఆరేళ్ల పాప ఉందని, ఆ పాప బాధ్యత ఆమెకు కూడా ఉంటుందని గుర్తించాలని పోలీసులు చెప్పారు. ఇప్పుడు తాను తన భర్తతోనే ఉంటానని చెబుతోందన్నారు.
కాగా, రాజేంద్రనగర్‌లో కిడ్నాప్‌నకు గురైన వివాహిత రాధిక ఆచూకీ లభించిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ కిడ్నాపర్ మహిళను కిడ్నాప్ చేసి ఆమె భర్తను డబ్బులు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తనను కిడ్నాప్ చేశారంటూ ఆ మహిళ తన భర్తకు సెమీ న్యూడ్ పిక్చర్స్ పంపించింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్ కోసం విస్తృత గాలింపు చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో కిడ్నాపర్‌ను పోలీసులు కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. కాగా, కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు రిజ్వాన్. మహిళ పేరు రాధిక అని తెలుస్తోంది. వారు తొలుత కటక్ వెళ్లారు. అక్కడి నుండి కోల్‌కతాకు మకాం మార్చారు. నిందితులు ఇద్దరినీ పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.
తప్పుడు ప్రొఫైల్‌తో కిడ్నాపర్ (రిజ్వాన్) మహిళను (రాధిక) తన వైపు తిప్పుకున్నాడు. ఇరువురు నాలుగేళ్లుగా చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ నెల 4వ తేదీన పారిపోయారు.












Click it and Unblock the Notifications