ఈసీకి ముందే ఏసీబీ సమాచారం, విచారణకు సహకరిస్తానని నరేందర్ రెడ్డి

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో మరో కీలక మలుపు. ఈ వ్యవహారంపై ఏసీబీ చీఫ్ ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఓటుకు నోటు వ్యవహారం పైన ఎలక్షన్ కమిషన్ బుధవారం స్పందించింది.

ఎలక్షన్ కమిషన్ నుంచి తెలంగాణ అవినీతి నిరోదక శాఖకు లేఖ కూడా వచ్చింది. ఈ కేసును ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఎమ్మల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు కేసులో దర్యాప్తు కొనసాగించాలని ఏసీబీకి ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది.

లేఖ వచ్చినట్లు ఏసీబీ వర్గాలు దృవీకరించాయి. ఈ కేసుపై పూర్తి విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది. కేసులో లాజికల్ ఎండ్ కనుక్కోవడానికి ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను ఆదేశించింది. సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని ఈసీ ఆదేశించింది.

New twist in cash for vote, Vem Narender Reddy arrest

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి అరెస్టుకు ముందే ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఈసీకి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఏసీబీ రెండుసార్లు సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో, పూర్తి విచారణ చేయాలని ఈసీ ఏసీబీని ఆదేశించింది.

ఏసీబీ విచారణకు సహకరిస్తా: వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసులో విచారించేందుకు తమ ముందు హాజరు కావాల్సిందిగా ఏసీబీ ఆదేశించడంతో ఈరోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి ఆయన వెళ్లారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఆయన్ని నాలుగైదు గంటల పాటు ఏసీబీ విచారంచింది.

దీంతో ఈ కేసుకు సంబంధించిన ఏసీబీ అధికారులు ఆయన్ని సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+