"మా డాడీ ఎవరో తెలుసా..?" అంటే కుదరదు..
న్యూ ఇయర్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక ట్వీట్ చేశారు. మియా, డ్రింక్ చేశావా..? అయితే స్టిరింగ్ కు సలాం చెప్పి క్యాబ్ బుక్ చేసుకో.. లాయర్ ను కాదు' అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకుండా క్యాబ్ ఎంచుకోవాలని సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇలా ‘Ma daddy evaro telusa’, ‘ma uncle evaro telusa’, ‘anna evaro telusa’… aani maa officers ki అడగొద్దు. Memu mee privacy ni respect chestham. Vehicle pakaku petti, malli date vachina roju Court lo parichayam chesukundam. #Hyderabad Police bole toh — Zero tolerance to drunk… https://t.co/ZpNHRzDA5G
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2025
అలాగే మరో ట్వీట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి.. 'మా డాడీ ఎవరో తెలుసా..?', 'మా అంకుల్ ఎవరో తెలుసా..?'..'అన్న ఎవరో తెలుసా..?'... అని తమ అధికారులను అడగొద్దని సీపీ సజ్జనార్ సూచించారు. అలా అంటే చెబితే ఏమీ జరగదని అన్నారు. తాము ప్రజల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తామని.. అలాంటప్పుడు వాహనం పక్కకు పెట్టి, మళ్లీ కోర్టులో డేట్ వచ్చినప్పుడు కలుస్తామని సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మరోవైపు నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో నగరంలోని అనేక పబ్బులపై ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో క్వెక్ ఎరీనా పబ్ లో తనిఖీలు నిర్వహించింది. అనుమానం వచ్చిన యువకులకు టెస్టులు చేసింది. దీంతో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. మొత్తం 14 మందికి పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ అని తేలింది. ఇక డ్రగ్స్ కేసులో 10 రోజుల్లో 27 మందిని ఈగల్ బృందం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు విదేశీయులు సహా 17 మంది డ్రగ్ సప్లై దారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిందితుల నుంచి 68 గ్రాముల కొకైన్, 50. 5 గ్రాముల ఎండీఎంఏ.. అలాగే 382 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications