• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కాంగ్రెస్‌కు హెచ్చరికే: సీఎం కేసీఆర్ - పవన్ కల్యాణ్ భేటీ వ్యూహాత్మకమేనా?

  By Swetha Basvababu
  |
   Pawan & KCR's meeting : కేసీఆర్ - పవన్ భేటీ : 'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై' !

   హైదరాబాద్: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలుగునాట తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరు ఎవరినైనా కలువొచ్చు. ఇందులో వింతేమీ లేదు. 2014 అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికల సందర్భంగా పరస్పర విమర్శలతో 'రాజకీయ వేడి'ని పెంచిన వారు ప్రస్తుతం కలువడమే ప్రత్యేకత. అంతే కాదు నాడు 'మాటల తూటాలు' పేల్చినవారు ఈనాడు ప్రశంసలు గురిపించడం మారిన పరిస్థితులను తెలియజేస్తున్నది.

   రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలూ అవే చెప్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు ఒంటికాలిపై లేచే వారు. అటువంటి వారిలో పవర్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఒకరు.

    గుడ్‌విల్ భేటీ అంటూ సంకేతాలిచ్చిన జనసేనాధినే

   గుడ్‌విల్ భేటీ అంటూ సంకేతాలిచ్చిన జనసేనాధినే

   నూతన సంవత్సరం సందర్భంగా తొలిసారి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో దాదాపు గంటసేపు సమావేశం కావడం సహజంగానే రాజకీయ సర్కిళ్లలో చర్చనీయాంశమే. భేటీ తర్వాత ఇదొక గుడ్ మీట్ అని పవర్ స్టారే చెప్పకనే చెప్పారు. దీంతో భవిష్యత్‌లో రాజకీయ సమీకరణాలు మారతాయా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
   సోమవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్ కోసం పవన్ కల్యాణ్ వేచి ఉండటం మరింత ఆసక్తికర పరిణామం. ఈ భేటీ వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? పైకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపినప్పటికీ.. ఈ భేటీ వెనుక ప్రధాన కారణం ఏదో రాజకీయ మతలబు ఉండి ఉంటుందేనని చెప్తున్నారు.

    2014లో కేసీఆర్, పవన్ ‘పంచ్' డైలాగులిలా..

   2014లో కేసీఆర్, పవన్ ‘పంచ్' డైలాగులిలా..

   సీఎం కేసీఆర్ - పవన్ కల్యాణ్ భేటీ కావడాన్ని వివాదాస్పద సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ హైలేట్ చేశారు. గత చరిత్రను తిరగేస్తూ తాను వర్మనని రుజువు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ గతంలో ఓ వేదికపై ప్రసంగిస్తూ అన్నమాటలని, అలాగే పవన్‌పై కేసీఆర్ ఓ బహిరంగ సభలో పేల్చిన పంచ్ డైలాగులను గుర్తు చేస్తూ.. రాజకీయ నాయకుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో మరోసారి తన పోస్ట్‌లో తెలిపారు. తెలంగాణలో దాదాపు నాలుగేళ్ల క్రితం ఎన్నికల వేడి మొదలైన తర్వాత జరిగిన బహిరంగ సభల్లో టీడీపీ - బీజేపీ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ‘ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా..!!!' అని పేర్కొంటే ప్రతిగా ప్రస్తుత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అధినేతగా ‘ఆడి పేరేందిరా బై.' అని ప్రతిస్పందించారు. రాజకీయ పరిణామాలు అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చేస్తుంది. జై రాజకీయ నాయకుల్లారా! అంటూ కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోని వర్మ ట్వీట్ చేశారు.

    మోదీపై విమర్శలు చేస్తే కేసీఆర్ తాట తీస్తానన్న జనసేన అధినేత

   మోదీపై విమర్శలు చేస్తే కేసీఆర్ తాట తీస్తానన్న జనసేన అధినేత

   ఈ సందర్భంగా ఒక్కసారి ఎన్నికల ప్రచారం వేళ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై పవన్ కల్యాణ్, ఆయనకు ధీటుగా కేసీఆర్ కుటుంబ సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లను పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. గమ్మత్తేమిటంటే వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర చదివానని పేర్కొన్న పవర్ స్టార్.. నాడూ నేడూ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీకి.. దాని మిత్రపక్షం బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ‘జనసేన' పార్టీ ఆవిర్భావ సభలో తొలుత కేసీఆర్ కుటుంబ సభ్యులపై విమర్శలు సంధించినా ప్రారంభమే కదా? అని భావించారు. నాడు ప్రచార సరళి ముగింపు దశలో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ.. తెలంగాణకా దుష్మన్ అని టీఆర్ఎస్ అధినేతగా సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై తెలంగాణ బీజేపీ నేతలే స్పందించలేదు.

    పవన్ కల్యాణ్ కు సీఎం కేసీఆర్ ఇలా కౌంటర్

   పవన్ కల్యాణ్ కు సీఎం కేసీఆర్ ఇలా కౌంటర్

   వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు చేయడానికి తల్లిని చంపి పిల్లను బయటకు తీశారని ప్రధాని నరేంద్రమోదీ పదేపదే విమర్శలు చేసిన సంగతి రాజకీయ ప్రముఖుల మనోద్రుష్టిని ఇంకా దాటిపోలేదు. మోదీని మరోసారి విమర్శిస్తే కేసీఆర్ తాట తీస్తానని పవన్ కల్యాణ్ బెదిరింపులకు దిగారు. సీఎం కేసీఆర్ కూడా తక్కువేం తినలేదు. చాతుర్యం ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవడ్రా వాడు.. సినిమా యాక్టర్.. పవన్ కల్యాణ్ అట తాట తీస్తానని బెదిరిస్తాడా? తాను చిటికేస్తే వెయ్యి ముక్కలవుతడని ప్రతిగా సవాల్ విసిరారు కేసీఆర్. అంతటితో ఆగలేదు సవాళ్లు. తెలంగాణ కోసం భరిస్తానని, కేసులు పెట్టినా సమర్థించుకునేందుకు కూడా పవన్ కల్యాణ్ వెనుకాడలేదు.

    రాజకీయ సన్యాసానికి సిద్ధమని హరీశ్ రావు ప్రతి సవాల్

   రాజకీయ సన్యాసానికి సిద్ధమని హరీశ్ రావు ప్రతి సవాల్

   తెలంగాణ జాగ్రుతి జమా ఖర్చులు చెప్పాలన్న పవన్ కల్యాణ్ తిక్కకు లెక్కే లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. ఇక ప్రస్తుత రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తనపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు రుజువైతే రాజకీయ సన్యాసానికి సిద్ధమని, లేదంటే 24 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే న్యాయపరంగా ముందుకెళతామని గడువు పెట్టారు. కేసీఆర్‌పై తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు చేసేందుకు వెనుకాడుతున్న తరుణంలో దూకుడుగా విమర్శలు సాగిస్తూ ప్రచారం సాగించిన పవన్ కల్యాణ్.. తాజాగా ఇటీవల రాజ్ భవన్‌లో తొలిసారి సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. అదే విషయాన్ని గుర్తు చేసిన పవన్ కల్యాణ్.. మరోసారి తనను కలువాలని సీఎం కేసీఆర్ చెప్పారని ఆయనతో భేటీ తర్వాత మీడియాతో చెప్పడం గమనార్హం.

    సీఎం కేసీఆర్ ప్రయోజనాల పరిరక్షణ కోసమేనా ఈ భేటీ?

   సీఎం కేసీఆర్ ప్రయోజనాల పరిరక్షణ కోసమేనా ఈ భేటీ?

   తెలంగాణలో తనకు అభిమానులు, జనసేనకు తగినంత బలం ఉన్నదని చెప్పడం ద్వారా భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతాలిచ్చారా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. 2009 డిసెంబర్ 10 నుంచి ఈనాటి వరకు తెలంగాణ పట్ల రెండు కళ్ల సిద్ధాంతం ప్రదర్శిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. టీఆర్ఎస్ అధ్యక్షుడు - తెలంగాణ సీఎం కేసీఆర్ పరస్పరం వ్యక్తిగత ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకే రాజకీయంగా ఏకైక వ్యూహంతో సాగుతున్నారన్న చర్చ రాజకీయ సర్కిళ్లలో ప్రముఖంగా వినిపిస్తున్నది.

    రేవంత్ రెడ్డి కోసం ఇలా ‘వెల్ కమ్' వ్యూహం

   రేవంత్ రెడ్డి కోసం ఇలా ‘వెల్ కమ్' వ్యూహం

   2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ‘ఓటుకు నోటు' కేసులో చిక్కుబడ్డ చంద్రబాబు విజయవాడకు తరలి వెళ్లిన తర్వాత ‘అమరావతి' నగర శంకుస్థాపనకు అతిథిగా వెళ్లి వచ్చారు. దానికి ప్రతిగా ఎర్రవల్లి వద్ద భారీగా సీఎం కేసీఆర్ చేపట్టిన యజ్నంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి విషయంలో సమస్యల్లేకుండా చేసుకునేందుకు ‘వెల్ కమ్' సూత్రంతో తెలంగాణలో టీడీపీ - టీఆర్ఎస్ పొత్తు ప్రతిపాదనలపై చర్చ ఇరు పార్టీల అధినేతల ఆమోదం లేకుండా జరిగిందని భావించలేం.

    నిరంతర విద్యుత్ సరఫరా వ్యయ ప్రయాసలకు నిలయం

   నిరంతర విద్యుత్ సరఫరా వ్యయ ప్రయాసలకు నిలయం

   అలాగే 2014లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తాను కొన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని, భోజనం సహించలేదని చెప్పిన పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన భేష్షుగ్గా ఉన్నదని కితాబివ్వడం ఆసక్తిదాయకం. అయితే నాడు ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ‘స్టిక్' పట్టుకుని ఫలానా ఫలాన మార్గాల్లో కరంట్ సమస్య ఉంటుందని ఎత్తి చూపిన సంగతి గమనించదగిన విషయం. కానీ ఈనాడు తెలంగాణ గడ్డపై నిరంతర విద్యుత్ సరఫరా కోసం సీఎం కేసీఆర్ ఎన్ని వ్యయ ప్రయాసలను భరిస్తున్నారో అర్థం అవుతూనే ఉన్నది.

    కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకే పవన్ కల్యాణ్ ప్రయత్నమా?

   కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకే పవన్ కల్యాణ్ ప్రయత్నమా?

   తెలంగాణ తొలి ఉద్యమానికి పాల్వంచ కేటీపీఎస్ నేపథ్యం కావడంతో తర్వాతీ కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు స్థాపించని దుర్మార్గపు నీతి సీమాంధ్ర పాలకులది. అయితే పరస్పర వ్యక్తిగత ప్రయోజనాల పరిరక్షణలో పాలకులెవరైనా ఒక్కటే అన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క తానులో ముక్కలేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కోవలోనే వారిద్దరి మైత్రిని ప్రోత్సహించే దిశగా తెలుగునాట కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకూడదన్న వ్యూహంతోనే పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   HYDERABAD: Strange are the ways of politicians. Bitter critics K Chandrasekhar Rao and Pawan Kalyan met on Monday at Pragathi Bhavan, chief minister K Chandrasekhar Rao's camp office at Begumpet. While it was described by the CMO as a courtesy call made by the Jana Sena Party (JSP) leader to wish him on new year's day, the meeting has raised eye brows for many reasons.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more