తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కారణం ఏమిటంటే? డిశ్చార్జీల్లో పెరుగుదల

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కేసులు వెయ్యి వరకు తగ్గాయి. ఈ మధ్యకాలంలో నమోదవుతోన్న కేసులతో పోల్చుకుంటే.. వాటి సంఖ్య భారీగా తగ్గినట్టే. ఇదివరకు రోజూ 2400లకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. సోమవారం నాటి బులెటిన్ ప్రకారం వాటి సంఖ్య 1400కు పడిపోయింది. ఒక్కసారిగా కేసులు తగ్గడానికి కారణం.. రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందనుకుంటే పొరపాటే. రోజువారీ టెస్టింగులు తగ్గడం వల్లే.. పాజిటివ్ కేసుల నమోదులోనూ అదే స్థాయి క్షీణత కనిపించింది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,417 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13 మంది మరణించారు. 2,479 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,58,513కు చేరుకుంది. ఇందులో 1,27,007 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 974కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 30,532గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 23,639 మంది చికిత్స పొందుతున్నారు.

Newly 1417 Covid19 positive cases and 13 deaths reported in Telangana last 24 hours

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 24 గంటల్లో 264 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ తరువాత రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 210 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

జిల్లాలవారీగా ఆదిలాబాద్-12, భద్రాద్రి కొత్తగూడెం-27, జగిత్యాల-34, జనగామ-20, జయశంకర్ భూపాలపల్లి-8, జోగుళాంబ గద్వాల-12, కామారెడ్డి-11, కరీంనగర్-108, ఖమ్మం-37, కొమరంభీమ్ ఆసిఫాబాద్-16, మహబూబ్ నగర్-34, మహబూబాబాద్-54, మంచిర్యాల-28, మెదక్-13, మేడ్చల్ మల్కాజ్‌గిరి-25, ములుగు-9, నాగర్ కర్నూలు-32, నల్లగొండ-47, నారాయణపేట్-1, నిర్మల్-8, నిజామాబాద్-67, పెద్దపల్లి-39, రాజన్న సిరిసిల్ల-24, రంగారెడ్డి-133, సంగారెడ్డి-107, సిద్ధిపేట్-75, సూర్యాపేట్-34, వికారాబాాద్-6, వనపర్తి-19, వరంగల్ రూరల్-20, వరంగల్ అర్బన్-70, యాదాద్రి భువనగిరి-23 కేసులు నమోదు అయ్యాయి.

కరోనా వైరస్ పరీక్షల జోరు ఒక్కసారిగా తగ్గింది. కొత్తగా 34,,427 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 21,69,339కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 58,431 పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+