తెలంగాణలో కొత్త కరోనా హాట్‌స్పాట్‌గా: ఒక్కరోజులో 200లకు పైగా పాజిటివ్: అల్లాడుతోన్న జిల్లా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రతలో పాత పరిస్థితులే కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. కరోనా వైరస్ కేసులు లక్షకు చేరువ అయ్యాయి. 99 వేలకు పైగా చేరుకున్నాయి. లక్షమార్క్‌ను అధిగమించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పూర్తిగా నియంత్రణంలోకి రావట్లేదు కరోనా మహమ్మారి. రోజువారీ కేసులు రెండువేలకు కాస్త అటుఇటుగా నమోదవుతున్నాయి.

రెండు వేలకు చేరువగా..

రెండు వేలకు చేరువగా..

24 గంటల వ్యవధిలో కొత్తగా 1967 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 1781 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 99,391కి చేరుకుంది. ఇందులో 76,967 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 737కు చేరుకుంది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 21,687గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 15,332 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం బులెటిన్‌ను విడుదల చేసింది.

రంగారెడ్డి.. డబుల్ సెంచరీ

రంగారెడ్డి.. డబుల్ సెంచరీ

తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల్లో అధికవాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌దే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో కొత్తగా 473 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. జీహెచ్ఎంసీకి ఏ మాత్రం తీసిపోని విధంగా రంగారెడ్డి జిల్లా తయారైంది. ఈ జిల్లాలో కొత్తగా 202 కేసులు నమోదు అయ్యాయి. రోజురోజకూ పెరుగుతోన్న కేసులతో రంగారెడ్డి జిల్లా అల్లాడుతోంది. మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి.

 జిల్లాలవారీగా వివరాలివే..

జిల్లాలవారీగా వివరాలివే..

24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-16, భద్రాద్రి కొత్తగూడెం-21, జగిత్యాల-81, జనగామ-22, జయశంకర్ భూపాలపల్లి-12, జోగుళాంబ గద్వాల-55, కామారెడ్డి-55, కరీంనగర్-86, ఖమ్మం-79, కొమరంభీమ్ ఆసిఫాబాద్-15, మహబూబ్ నగర్-29, మహబూబాబాద్-26, మంచిర్యాల-40, మెదక్-24, మేడ్చల్ మల్కాజ్‌గిరి-170, ములుగు-11, నాగర్ కర్నూలు-27, నల్లగొండ-60, నారాయణ పేట్-14, నిర్మల్-19, నిజామాబాద్-69, పెద్దపల్లి-35, రాజన్న సిరిసిల్ల- 29, రంగారెడ్డి-202, సంగారెడ్డి-38, సిద్ధిపేట్-49, సూర్యాపేట్-28, వికారాబాాద్-16, వనపర్తి-21, వరంగల్ రూరల్-26, వరంగల్ అర్బన్-101, యాదగిరి భువనగిరి-18 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    Godavari Floods : గోదావరి వరద.. కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు | Oneindia Telugu
    చాలాకాలం తరువాత పాతిక వేలకు పైగా టెస్టులు..

    చాలాకాలం తరువాత పాతిక వేలకు పైగా టెస్టులు..

    24 గంటల వ్యవధిలో మొత్తం 26,767 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. చాలాకాలం తరువాత రోజువారీ కరోనా పరీక్షలు పాతిక వేలను దాటుకున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 8,48,078కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 22,843 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాలు 1076 ఉన్నాయి. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+