తెలంగాణలో కరోనా: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జీల్లో తగ్గుదల: కారణం?

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుదల బాటు పట్టాయి. దీనికి అనుగుణంగా కరోనా మరణాలు నమోదవుతోన్నాయి. రోజువారీ డిశ్చార్జీల్లో తగ్గుదల కనిపించింది. ఈ మధ్యకాలంలో తక్కువ సంఖ్యలో డిశ్చార్జీలు నమోదు కావడం ఇదే తొలిసారి. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కేసు ఉధృతిలో ఎలాంటి మార్పూ ఉండట్లేదు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,043 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 1,802 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,67,046కి చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,35,357గా నమోదైంది. కరోనా వల్ల 1016 మంది మరణించారు. మొత్తం 30,673 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.

Newly 2043 Covid19 positive cases and 11 deaths reported in Telangana last 24 hours

గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో ఉంటోన్న వారి సంఖ్యలోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు. 24,081 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. డిశ్చార్జిల్లో తగ్గుదల చోటు చేసుకోవడానికి జిల్లాల నుంచి పూర్తిస్థాయి సమాచారం అందకపోవడమేనని చెబుతున్నారు. సమగ్ర వివరాలను సేకరించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 24 గంటల్లో 314 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-19, భద్రాద్రి కొత్తగూడెం-49, జగిత్యాల-42, జనగామ-25, జయశంకర్ భూపాలపల్లి-23, జోగుళాంబ గద్వాల-17, కామారెడ్డి-31, కరీంనగర్-114, ఖమ్మం-84, కొమరంభీమ్ ఆసిఫాబాద్-20, మహబూబ్ నగర్-26, మహబూబాబాద్-74, మంచిర్యాల-25, మెదక్-25, మేడ్చల్ మల్కాజ్‌గిరి-144, ములుగు-16, నాగర్ కర్నూలు-32, నల్లగొండ-131, నారాయణపేట్-12, నిర్మల్-16, నిజామాబాద్-65, పెద్దపల్లి-48, రాజన్న సిరిసిల్ల-46, రంగారెడ్డి-174, సంగారెడ్డి-71, సిద్ధిపేట్-121, సూర్యాపేట్-51, వికారాబాాద్-20, వనపర్తి-22, వరంగల్ రూరల్-33, వరంగల్ అర్బన్-108, యాదాద్రి భువనగిరి-45 కేసులు నమోదు అయ్యాయి.

కరోనా వైరస్ పరీక్షల జోరు కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 50,634 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 23,79,950కి చేరుకుంది. కరోనా పరీక్షల్లో కొత్త రికార్డును ప్రభుత్వం నెలకొల్పింది. ప్రతి 10 లక్షల మందికీ 64,104 టెస్టులను నిర్వహించింది. ఇప్పటిదాకా ఈ స్థాయిలో కరోనా పరీక్షలు తెలంగాణలో నమోదు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+