తెలంగాణలో వెయ్యికి చేరువగా కరోనా మరణాలు: మళ్లీ మొదటికి: వేలల్లో కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది. రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుదల బాటు పట్టాయి. దీనికి అనుగుణంగా కరోనా మరణాలు నమోదవుతోన్నాయి. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య వెయ్యికి చేరువైంది. మరోవంక- రోజువారీ డిశ్చార్జీల్లో అదే దూకుడును కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకుంటోన్న వారి సంఖ్య మరింత మెరుగుపడుతుంది. యాక్టివ్ కేసుల సంఖ్యను స్థిరంగా కొనసాగింపజేయడంలో ప్రభుత్వం విజయవంతమౌతోంది.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,273 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 12 మంది మరణించారు. 2,260 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,62,844కి చేరుకుంది. ఇందులో 1,31,447 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల 996 మంది మరణించారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 30,401గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 23,569 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

యాక్టివ్ కేసుల సంఖ్య కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులకు అనుగుణంగా డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటున్నాయి. కాగా- అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 24 గంటల్లో 325 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్లగొండ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Newly 2273 Covid19 positive cases and 12 deaths reported in Telangana last 24 hours

ఆదిలాబాద్-19, భద్రాద్రి కొత్తగూడెం-56, జగిత్యాల-50, జనగామ-33, జయశంకర్ భూపాలపల్లి-21, జోగుళాంబ గద్వాల-21, కామారెడ్డి-68, కరీంనగర్-122, ఖమ్మం-97, కొమరంభీమ్ ఆసిఫాబాద్-24, మహబూబ్ నగర్-42, మహబూబాబాద్-57, మంచిర్యాల-38, మెదక్-24, మేడ్చల్ మల్కాజ్‌గిరి-164, ములుగు-22, నాగర్ కర్నూలు-33, నల్లగొండ-175, నారాయణపేట్-3, నిర్మల్-36, నిజామాబాద్-91, పెద్దపల్లి-47, రాజన్న సిరిసిల్ల-40, రంగారెడ్డి-185, సంగారెడ్డి-58, సిద్ధిపేట్-91, సూర్యాపేట్-73, వికారాబాాద్-24, వనపర్తి-32, వరంగల్ రూరల్-33, వరంగల్ అర్బన్-114, యాదాద్రి భువనగిరి-55 కేసులు నమోదు అయ్యాయి.

కరోనా వైరస్ పరీక్షల జోరు కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 55,636 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. వరుసగా రెండు రోజుల పాటు ఈ స్థాయిలో కరోనా పరీక్షలు నమోదు కాలేదు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 22,76,222కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 61,310 పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+