తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పేషెంట్లు: కొత్త కేసులూ తగ్గుముఖం: గ్రేటర్‌లో రికార్డుస్థాయిలో

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి భారీగా తగ్గుదల కనిపించింది. రోజువారీ కరోనా కేసుల క్షీణత కొనసాగుతోంది. ఇదివరకు గరిష్ఠంగా మూడువేల వరకు నమోదైన కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా మరోసారి వెయ్యికంటే దిగవకే కొత్త కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసుల సంఖ్య తగ్గడం, అదే సమయంలో డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తొలిసారిగా 20 వేల కంటే దిగువకు పడిపోయింది.

రోజువారీ కేసుల్లో తగ్గుదల నమోదు కావడానికి ప్రధాన కారణం.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో వేగం మందగించడమేననే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 978 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 1,446 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,31,252కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,10,480గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1307కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 19,465గా నమోదు అయ్యాయి.

Newly 978 Covid19 positive cases and 4 deaths reported in last 24 hours

గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 16,430 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా తెలంగాణలో నమోదయ్యే కరోనా వైరస్ రోజువారీ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ వాటా అత్యధికంగా ఉంటుంది. రోజువారీ కేసులు 700లకు పైగా నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో సుదీర్ఘకాలం పాటు కరోనా కేసులు 600-700 మధ్యలో నమోదవుతూ వచ్చాయి. క్రమంగా వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. రికార్డు స్థాయికి పడిపోయింది.

24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 185 మాత్రమే. ఈ స్థాయిలో మరే ఇతర జిల్లాలోనూ కొత్త కేసులు వెలుగులోకి రాలేదు. వంద మార్క్‌ను అందుకోలేదు. జిల్లావారీగా ఆదిలాబాద్-20, భద్రాద్రి కొత్తగూడెం-47, జగిత్యాల-25, జనగామ-16, జయశంకర్ భూపాలపల్లి-9, జోగుళాంబ గద్వాల-12, కామారెడ్డి-18, కరీంనగర్-27, ఖమ్మం-62, కొమరంభీమ్ ఆసిఫాబాద్-2, మహబూబ్ నగర్-17, మహబూబాబాద్-12, మంచిర్యాల-22, మెదక్-18, మేడ్చల్ మల్కాజ్‌గిరి-86, ములుగు-9, నాగర్ కర్నూలు-21, నల్లగొండ-59, నారాయణపేట్-1, నిర్మల్-10, నిజామాబాద్-18, పెద్దపల్లి-12, రాజన్న సిరిసిల్ల-22, రంగారెడ్డి-89, సంగారెడ్డి-24, సిద్ధిపేట్-27, సూర్యాపేట్-24, వికారాబాాద్-15, వనపర్తి-19, వరంగల్ రూరల్-11, వరంగల్ అర్బన్-25, యాదాద్రి భువనగిరి-14 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    APSRTC : ఏపీ-తెలంగాణ మధ్య RTC బస్సుల రాకపోకలపై ప్రతిష్టంభన.. సరిహద్దుల వరకే బస్సులు!

    తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మరోసారి మందగించాయి. 24 గంటల్లో కొత్తగా 27,055 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 40,79,688కి చేరుకుంది. ప్రతి 10 లక్షల మందికీ 1,09,,610 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+