కొత్త సర్పంచ్ లకు మొదలైన కిష్కిందకాండ.. ఇక వాటి వెంటపడుడే!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పోరు ముగిసింది. గ్రామ పంచాయతీలలో సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నిక పూర్తయింది. ఇక ఎన్నికైన సర్పంచులు ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు కిష్కింద కాండ మొదలు కాబోతుంది. అధికార బాధ్యతలు చేపట్టగానే ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన కోతుల బెడదను పరిష్కరించవలసిన బాధ్యత ఇప్పుడు వారి ముందు ఉంది.

గ్రామాలలో కోతుల బెడద
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో కోతుల సమస్య అతి పెద్ద సమస్యగా ఉంది. ఇది గ్రామీణ జీవన విధానాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. దీంతో ఈ కోతుల నుండి మమ్మల్ని కాపాడండి మహా ప్రభో అంటూ అధికారులకు అనేకమార్లు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.

newly elected Sarpanches to face a challenge with monkeys problem in most of the villages

కోతులతో జనాలు బెంబేలు
చాలా గ్రామాల్లో కోతులు పంట పొలాలను పాడు చేయడం, రైతులకు భారీ నష్టం చేయడం మాత్రమే కాకుండా, ఇంటి పైకప్పులు పీకడం, నీటి ట్యాంకులు, కరెంటు వైర్లు పాడు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. అంతేకాదు ఇళ్లల్లోకి వెళ్లి నాశనం చేస్తున్నాయి. బయట రోడ్లమీద తిరగాలంటేనే జనం భయపడే స్థాయికి కోతులు చేరుకున్నాయి. దీంతో వృద్ధులు పిల్లలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.

ఆ హామీతోనే గెలిచిన చాలామంది సర్పంచ్ లు
రోడ్లమీద ఒక్కొక్కసారి జనాలపైన కోతులు దాడులకు కూడా పాల్పడుతున్నాయి. గ్రామాలలో తాత్కాలికంగా డప్పులు కొట్టినా, టపాసులు కాల్చినా, కొండముచ్చులతో భయపెట్టినా కూడా కోతులు మాత్రం గ్రామాలను వదలడం లేదు. ఈ కారణంగా అనేక గ్రామాలలో కోతుల సమస్యను పరిష్కరిస్తాం అంటే ఓటు వేస్తామని ప్రజలు తేల్చి చెప్పారు. చాలామంది ఎన్నికల హామీలలో తమను ఓటేసి గెలిపిస్తే ఊర్లో కోతులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చుకోవలసిన అవసరం వచ్చింది.

కోతులను పట్టిస్తున్న కొత్త సర్పంచ్ లు
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్కూరు గ్రామ సర్పంచ్ వెనువెంటనే నిలబెట్టుకున్నారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో.. సర్పంచ్ చింతలపల్లి విజయమ్మ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గెలవగానే .. కోతులు పట్టేవాళ్లను రప్పించి కోతులను పట్టిస్తున్నారు.

కోతులు లేకుండా చేయటం సర్పంచ్ లకు పెద్ద టాస్క్
కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌ గ్రామ సర్పంచిగా గెలిచిన దుర్గపు సుజాత ప్రమాణస్వీకారానికి ముందే బోన్లు తెప్పించి కోతులను పట్టడం ప్రారంభించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కోతులు లేకుండా చేస్తామని చెబుతున్నారు. ఇక వీరి బాటలో హామీ ఇచ్చిన చాలామంది సర్పంచ్ ల ముందు కోతులను పట్టుకోవలసిన బాధ్యత ఉంది. సర్పంచ్ లుగా గెలిచిన వీరు ఈ కిష్కింద కాండలో ముందు ముందు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+