తెలంగాణలోని మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్: ఉరుములు మెరుపులతో వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత రోజు నుంచి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గాలి విచ్చిన్నతి విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతోందిన పేర్కొంది.
సోమవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత రోజు నుంచి పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications