2014 తర్వాత మాట మార్చారు, రాజకీయ ఒత్తిడి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేతపై అసదుద్దీన్
Recommended Video

హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం స్పందించారు. ఈ కోర్టు తీర్పుతో ఏ విధమైన న్యాయం జరగలేదని వాపోయారు.
కాగా, మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా వారిపై కేసు కొనసాగుతుందని న్యాయవాదులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తీర్పుపై అసదుద్దీన్ స్పందించారు.

2014 తర్వాత చాలామంది సాక్షులు తమ మాటను మార్చారని అసదుద్దీన్ వాపోయారు. ఈ కేసులో సరైన దర్యాఫ్తు జరగలేదని మండిపడ్డారు. ఎన్ఐఏ పైన రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన దర్యాఫ్తు జరగలేదన్నారు.
స్వాగతించిన బీజేపీ రామచంద్ర రావు
కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు. నాటి కేంద్రం ఈ కేసులో అమాయకులను ఇరికించిందన్నారు. సంఘ్ పరివార్‌ను అప్రతిష్టపాలు చేసే పని చేసిందన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందన్నారు.












Click it and Unblock the Notifications