డాలర్లుగా మార్చేస్తుందంటే నమ్మేశాడు, రూ. 75 లక్షలు మోసపోయాడు
హైదరాబాద్: ఓ రసాయన ద్రవం నల్లటి పేపర్‌ను నిజమైన అమెరికా డాలర్లుగా మార్చేస్తుందంటే ఓ హైదరాబాద్ నమ్మేసి, దాదాపు రూ.75 లక్షల రూపాయలను ఓ నైజీరియన్‌కు ముట్టజెప్పుకున్నాడు. ఆ నైజీరియన్‌ను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
బ్లాక్ పేపర్ బండిల్స్ ఇచ్చి రూ. 75 లక్షల రూపాయల మేరకు మోసం చేసిన నైజీరియన్ చివరకు పోలీసులకు చిక్కాడు. అతన్ని డేవిడ్ ఫ్లెచర్ అలియాస్ ఆస్టిన్ ఎసీగా గుర్తించారు. రసాయనిక ద్రవం నల్లటి పేపర్లను నిజమైన అమెరికా డాలర్లుగా మార్చేస్తుందని అతను మొహ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తిని నమ్మించాడు.
ఆ మొత్తం లక్ష అమెరికా డాలర్లు అవుతాయని నైజీరియన్ అతనికి చెప్పాడు. ఆ రకంగా అతను కథలు చెప్పి గత రెండేళ్లుగా మొహమ్మద్ ఇబ్రహీం నుంచి రూ.75 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇబ్రహీంను నమ్మించి లక్షలాది రూపాయలు కాజేశాడు.

తండ్రి ఆస్తిని కుదవపెట్టాడు..
హైదరాబాదులోని హస్మత్‌పేటకు చెందిన మొహ్మద్ ఇబ్రహీం తన తండ్రి ఆస్తిని కుదువపెట్టి నైజీరియన్ ఆస్టిన్‌కు వరుసగా డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు. నైజీరియన్ మాటలు నమ్మి మోసపోయిన ఇబ్రహీంను అతని కుటుంబ సభ్యులు ఇంట్లోంచి వెళ్లగొట్టారు.

ఇలా మొదలైంది...
నిందితుడి నుంచి ఇబ్రహీంకు ఓ మెయిల్ రావడంతో కథ ప్రారంభమైంది. తాను ఓ మెడికల్ డాక్టర్‌నని, తన పేరు మైక్ అని, హైదరాబాదులో తాను ఆఫీసు పెట్టాలని అనుకుంటున్నానని అతను ఇబ్రహీంకు చెప్పాడు.

డబ్బు పంపిస్తానని చెప్పాడు.
తాను డబ్బులు పంపిస్తానని నిందితుడు ఇబ్రహీంకు చెప్పాడు. ఆ తర్వాత అతను ఫోన్ చేసి కన్‌సైన్‌మెంట్ ఢిల్లీకి చేరుకుందని ఇబ్రహీంకు చెప్పాడు.

కంటైనర్ వచ్చింది....
ఇబ్రహీం ఢిల్లీ వెళ్లి కన్‌సైన్మెంట్ తీసుకున్నాడు. మెటల్ కంటైనర్‌ను అతను తీసుకున్నాడు. ఇందులో లక్ష ఉన్నాయని అందులోరాసి ఉంది. అయితే కంటైనర్‌లో నల్లటి పేపర్లు డాలర్ సైజులో ఉన్నాయి.

ఇలా నమ్మించాడు...
మార్క్ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఓ ద్రవ పదార్థంతో బ్లాక్ పేపర్స్‌ను కడిగాడు. దాంతో అవి నిజమైన అమెరికా డాలర్లుగా కనిపించాయి. అన్ని నోట్లను కూడా కడగడానికి అవసరమైన ద్రవాన్ని పంపిస్తానని నిందితుడు బాధితుడికి చెప్పాడు. దాని కోసం బాధితుడు లక్షల రూపాయలు చెల్లించాడు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications