హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమించాను: లండన్ అమ్మాయిలా, తియ్యగా మోసం, టెక్కీలకు వల

తన పేరు మార్గరేట్ ఫెరోన్సా అని, తాను లండన్‌లో ఉంటున్నానని, హోటల్స్‌కు సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటానని, తమ పూర్వీకులు భారత్‌లో కొన్నాళ్లు ఉన్నారని పరిచయం పెంచుకొని, ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి అంటూ యువత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన పేరు మార్గరేట్ ఫెరోన్సా అని, తాను లండన్‌లో ఉంటున్నానని, హోటల్స్‌కు సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటానని, తమ పూర్వీకులు భారత్‌లో కొన్నాళ్లు ఉన్నారని పరిచయం పెంచుకొని, ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి అంటూ యువతను మోసం చేస్తున్నారు నైజీరియన్లు.

హైదరాబాదులో నైజీరియన్లు వివిధ మార్గాల్లో మోసం చేస్తూ, లక్షలు దోచుకుంటున్నారు. మోసాల కోసం వారు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఈ నైజీరియన్ల బుట్టలో పలువురు పడి మోసపోతున్నారు.

ఇటీవల హిమయత్‌నగర్‌కు చెందిన వ్యక్తి నైజీరియన్ చేతిలో ఇలాగే మోసపోయాడు. తన పేరు మార్గరెట్ అని, తన తల్లిదండ్రులు కొన్నాళ్లు భారత్‌లో ఉన్నారని, భారత్ వాతావరణం తనకు నచ్చిందని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నారు.

కొన్నాళ్లకు.. కొద్ది రోజుల పరిచయంలోనే మిమ్మల్ని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దీంతో ఆ యువకుడు ఆ నైజీరియన్ల బుట్టలో పడ్డాడు. మనం పెళ్లి చేసుకుందామని, మీకు కొన్ని బహుమతులు పంపిస్తానని కూడా ఈ యువకుడికి చెప్పారు.

లక్షన్నర స్వాగా చేసి..

లక్షన్నర స్వాగా చేసి..

కొద్ది రోజులకు కస్టమ్స్ అధికారుల పేరుతో మీకు ఓ ప్యాక్ వచ్చిందని ఫోన్ వస్తుంది. అవి కావాలంటే లక్షన్నర రూపాయలు ఖాతాలో వేయాలని చెప్పడంతో, అతను అలాగే చేశాడు. ఆ తర్వాత ప్యాక్ రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన అతను పోలీసులకు ఫోన్ చేశాడు.

Recommended Video

London Fire : Fire Engulfs Grenfell Tower in Latimer Road West London
దర్యాఫ్తు సాగుతుండగానే..

దర్యాఫ్తు సాగుతుండగానే..

ఇలా పలువురికి మార్గరెట్ పేరుతో ఫోన్లు వచ్చాయి. చివరకు ఆ మార్గరెట్ ఢిల్లీలోని నైజీరియన్‌గా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాఫ్తు కొనసాగుతుండగానే పలు ఫిర్యాదులు వచ్చాయి.

నైజీరియన్ల కొత్త దారులు

నైజీరియన్ల కొత్త దారులు

నైజీరియన్ల మోసాలు పోలీసులు కట్టిపెడుతుండటంతో వారు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. లండన్ యువతుల్లా పరిచయాలు పెంచుకొని, బురిడీ కొట్టిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.

యవకులు, టెక్కీలు టార్గెట్

యవకులు, టెక్కీలు టార్గెట్

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని యువకులు, సాఫ్టువేర్ ఇంజినీర్లను వారు ఫేస్‌బుక్ ద్వారా టార్గెట్ చేస్తున్నారు. పరిచయం.. ఆ తర్వాత ఆప్యాయంగా మాట్లాడటం.. ప్రేమిస్తున్నానని చెప్పడం... పెళ్లి చేసుకుంటానని చెబుతూ బురిడీ కొట్టిస్తారు. ఆసక్తి కనబర్చిన వారిని సెలక్ట్ చేసుకొని బురిడీ కొట్టిస్తారు. ఇలా తమ ఖాతాల్లో లక్షలు వేయించుకుంటున్నారు.

English summary
A gang of Nigerian cheating the Hyderabad and Bengaluru youth through facebook from New Delhi. Nigerian gang duped as girl in facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X