డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్ ..పోలీసులు అదుపులో ప్రముఖ వ్యక్తి
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సైబరాబాద్‌లో పోలీసులు మంగళవారం చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈకేసులో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్‌సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నైజీరియా నుంచి డ్రగ్స్ వస్తున్నాయని సమాచారంతో చేపట్టిన తనీఖిల్లో భాగంగా భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుపడినట్టు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. నైజీరియాకు చెందిన యువతి అనోహ బ్లెస్సింగ్ ఫేక్ పాస్ పోర్టుతో ఇక్కడకు తరచు వచ్చి వెళ్తోందని గమనించిన తాము ఆమెపై ప్రత్యేక నిఘా పెట్టామని ... దీనిలో భాగంగానే ఆమె హైదరాబాద్‌కు డ్రగ్స్ వస్తోందని సమాచారంతో అనోహ బ్లెస్సింగ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అరెస్ట్ చేసిన ఐదుగురు నుంచి శాంపిల్స్ తీసుకున్నామని, ఐదుగురికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇక కేసులో దొరికిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు సైతం శాంపిల్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే డ్రగ్స్ కీలక సూత్రదారి అయిన ఏబుక సుజి పరారీలో ఉన్నారని,ఆయనపై రూ.20 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెప్పుకొచ్చారు.
తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.7 పబ్‌లకు యజమానిగా ఉన్న నిఖిల్ ధావన్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అతనికి నగరంలోని ఫేమస్ డీజేలతోపాటు, డ్రగ్స్‌తో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ సేవిస్తున్న వారిలో బడా పారిశ్రామిక వేత్తలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో పట్టుబడిన వారికి పోలీసులు పరీక్షలు నిర్వహించిన కోర్టులో హాజరు పర్చగా వారికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications