గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం: భారీగా మృతులు, ఆ రూట్లో వెహికిల్స్ కు నో ఎంట్రీ!
హైదరాబాదులోని మీర్ చౌక్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ భారీ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. భవనం మొదటి అంతస్తులో భారీ మంటలు చెలరేగడంతో, అగ్ని ప్రమాదంతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
దట్టంగా వ్యాపించిన పొగ.. తీవ్ర ఇబ్బంది
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తూ భవనంలో ఉన్న మరికొందరిని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఉస్మానియా, మలక్పేట యశోద, డి ఆర్టీవో, అపోలో ఆసుపత్రులకు తరలించారు. భారీగా మంటలు భవనంలో వ్యాపించడంతో భవనం మొత్తం ఒక్కసారిగా పొగతో నిండిపోయింది. భవనం లోపల ఉన్నవారు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ ఘటనలో 15 మందికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ ఆపరేషన్ చేసి సిబ్బంది వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి పది ఫైర్ ఇంజన్లతో ప్రయత్నాలు చేస్తున్నారు.
అగ్ని ప్రమాదానికి కారణం అదేనా?
అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పలువురు భావిస్తున్నారు. కానీ ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఎవరు? అన్నది వివరాలు రావాల్సి ఉంది . మృతులలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .
చార్మినార్ వైపు వెళ్ళే దారులు మూసివేత
ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో చార్మినార్ వైపు వెళ్లే ప్రధాన రహదారులను మూసివేశారు ట్రాఫిక్ పోలీసులు.హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో గుల్జార్ కృష్ణ పెరల్స్ మరియు మోడీ పెరల్స్ మొదటి ఎంత ఇస్తారు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో నాలుగు కుటుంబాలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు భవనంలో మొత్తం 30 మంది ఉన్నారని స్థానికులు చెప్పడంతో వారందరిని బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications