దారుణం: ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సర్పంచ్
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుబీర్ మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ కార్యాలయంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజుపై పాత సావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు బకెట్లతో నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనలో రావు రాజుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం అతడ్ని బైంసా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఉపాధి పనుల విషయంలో సంతకం చేయాలని సర్పంచ్ సాయినాథ్ కోరగా.. రాజు నిరాకరించడంతో పెట్రోల్ పోసి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
సర్పంచ్ సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అధికారి రాజుతోపాటు సర్పంచ్ సాయినాథ్ కూడా కుబీర్ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.












Click it and Unblock the Notifications