యాంత్రికలోపాలే నిషిత్ మరణానికి కారణమా? సేఫ్టీ మేజర్స్ కోసమే కోటిన్నర!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:నిషిత్ మరణానికి వాహనంలో ఉన్న యాంత్రిక లోపాలు ఉన్నట్టు వాహనాన్ని పరిశీలించిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అయితే మెర్సిడెజ్ కంపెనీకి చెందిన ప్రతినిధుల బృందం హైద్రాబాద్ కు వచ్చి ఈ సంఘటనస్థలాన్ని పరిశీలించారు.

వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ అతడి స్నేహితుడు మరణించారు. అయితే ఈ అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేసిన ఈ కారు ప్రమాదానికి గురైన కారులో ప్రయాణీస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు.

కారు ప్రమాదానికి గురికావడంతో పాటు కారులో ఉన్న నిషిత్ అతడి స్నేహితుడు రాజారవిచంద్ర మరణించడం పట్ల మెర్సిడెజ్ కంపెనీ ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. అసలు ఈ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎలా మరణించారనేదానిపై ఆరాతీస్తున్నారు నిపుణులు.

 సేఫ్టీ మేజర్స్ కోసమే కోటిన్నర ఖర్చు

సేఫ్టీ మేజర్స్ కోసమే కోటిన్నర ఖర్చు

మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ సేఫ్టీ మేజర్స్ కోసం కోటిన్నర రూపాయాలను ఖర్చు చేసింది. ఈ కారు విలువ సుమారు రెండున్నర కోట్లు. కోటిన్నర రూపాయాలతో సేఫ్టీ మేజర్స్ తీసుకొన్నా ఈ కారులో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లదనే భరోసాను మాత్రం ఆ కంపెనీ ఇవ్వలేకపోయింది. ఈ కారుకు ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రాణనష్టం ఉండదని భావించినా , నిషిత్ మరణంతో వాహనదారులకు మాత్రం కష్టాలు తప్పలేదని తేలింది.2.5 టన్నుల బరువు ఉంటుంది కారు. టెలిస్కోపీ స్టీరింగ్ రాడ్ సైతం పనిచేయకపోవడంతో నిషిత్ ఛాతీకి బలంగా తగిలింది.స్టెర్నమ్ బోన్ విరిగి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిని మరణానికి దారితీసిందని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వెల్లడిస్తోంది.

యాంత్రిక లోపాలే కారణమా?

యాంత్రిక లోపాలే కారణమా?

నిషిత్ ఉపయోగించిన కారులో యాంత్రిక లోపాల కారణంగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదానికి అతి వేగమే కారణం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలుత అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావించారు. అయితే ప్రమాదానికి వాహనంలో యాంత్రిక లోపం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాహనం ప్రమాదానికి గురైన సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించలేదని పోలీసులు గుర్తించారు.

ఎయిర్ బ్యాగులు ఎందుకు ఓపెన్ కాలేదంటే?

ఎయిర్ బ్యాగులు ఎందుకు ఓపెన్ కాలేదంటే?

నిషిత్ ప్రయాణించిన కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాకపోవడానికి ఇంజన్ ముందుకు తోసుకురావడం కూడ ఒక కారణమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.వీటన్నింటి కారణంగా వాహనం భద్రతాపరమైన అనుమానాలకు తావిస్తోంది.ప్రపంచంలో బెంజ్ కంపెనీకి చెందిన ఈఏఎంజీ 63 కి చెందిన కారు రకరకాల క్రాస్ టెస్టుల్లో ధృడమైనవాహనంగా పేరు తెచ్చుకొంది.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో వాహనాలు దెబ్బతిన్నాయి.అయితే ఈ కంపెనీకి ఉన్న మంచి పేరుతో కంపెనీ ఏదో రకంగా నెట్టుకొచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా పోలీసుల విచారణ

టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా పోలీసుల విచారణ

పోస్టుమార్టం రిపోర్టు నేపథ్యంలో సమగ్ర టెక్నాలజీ రిపోర్ట్ ఆధారంగానే దర్యాప్తు చేయాలని హైద్రాబాద్ పోలీసులు భావిస్తున్నారు.ఈ మేరకు టెక్నికల్ రిపోర్ట్ ను సమగ్రంగా ఇవ్వాలని పోలీసులు కంపెనీ ప్రతినిధులను కోరారు. ఈ మేరకు కంపెనీకి వారం రోజుల గడువును ఇచ్చారు. జర్మనీ నుండి వచ్చిన కంపెనీ ప్రతినిధులు గురువారం నుండి పలు హైద్రాబాద్ లో పలు ప్రాంతాలను సందర్శించి ప్రమాదానికి గల కారణాలపై నివేదికను తయారు చేస్తున్నారు. అయితే ఈ కేసు నుండి బయటపడేందుకుగాను కంపెనీ ప్రయత్నిస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా నిషిత్ కుటుంబసభ్యులు కోర్టులో కేసు వేయనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A team of experts from car maker AMG Mercedes visited the spot where the SUV driven by AP Minister Narayana's son Nishith Narayana had the accident in which he was killed. The team also inspected the vehicle damaged in the crash at the showroom. Police said their investigation will proceed based on the team's report.
Please Wait while comments are loading...