హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయం పెంచండి: 'నీతి ఆయోగ్‌'తో కేసీఆర్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 14వ ఆర్ధిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ప్రకటించిందని, అందువల్ల అవసరమైన మేరకు తమ ప్రభుత్వానికి రుణపరపతిని పెంచుకునేలా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీతిఆయోగ్ సభ్యులను కోరారు.

ప్రణాళిక సంఘం స్ధానంలో ఏర్పాటైన 'నీతి ఆయోగ్' రాష్ట్రాల వారీ పర్యటనల్లో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన సభ్యులు వీకే సారస్వత్, అశోక్‌జైన్‌లతో గురువారం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెవెన్యూ మిగులు ఉండే రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఎక్కువ రుణసహాయాన్ని పొందే వెసులుబాటు ఉండాలని సీఎం కేసీఆర్ వారి దృష్టికి తెచ్చారు.

రెవెన్యూ మిగులు ఉన్న రాష్ర్టాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పారు. తెలంగాణ మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రమైనందున కేంద్రంతో సమానంగా రుణం తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలు చేపట్టిందని, వీటికి నిధుల ఆవశ్యకత ఉందని అన్నారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

ప్రణాళిక సంఘం స్ధానంలో ఏర్పాటైన 'నీతి ఆయోగ్' రాష్ట్రాల వారీ పర్యటనల్లో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన సభ్యులు వీకే సారస్వత్, అశోక్‌జైన్‌లతో గురువారం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెవెన్యూ మిగులు ఉండే రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఎక్కువ రుణసహాయాన్ని పొందే వెసులుబాటు ఉండాలని సీఎం కేసీఆర్ వారి దృష్టికి తెచ్చారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

ఎఫ్‌ఆర్‌బీఎంను సరళీకరిస్తే ఈ ప్రాజెక్టులకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. రాష్ర్టాలకు కేంద్రంనుంచి రావాల్సిన నిధులలో కోత విధించిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. కేంద్ర పథకాలకూ తగిన స్థాయిలో నిధులు రావడం లేదని చెప్పారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు బీవీ పాపారావు, జీఆర్ రెడ్డి, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రణాళికామండలి వైస్ చైర్మన్ ఎస్ నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్‌రావు, ప్రణాళిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

అంతకు ముందు ప్రణాళిక, ఆర్థికశాఖ, నీటిపారుదలశాఖ అధికారులతో నీతి ఆయోగ్ ప్రతినిధులు వేరువేరుగా సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం ఇతోధికంగా ఆర్థిక సాయమందించాలని ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి నీతి ఆయోగ్ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు పునర్విభజన చట్టాన్ని అనుసరించి ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులున్నా నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉందని, దీంతో తెలంగాణ ఆవిర్భవించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు వారి పరిపాలనలో చెరువులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, ఇదే తీరుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, భూములు, వ్యవసాయం, అక్షరాస్యత, ఆరోగ్యసూచి, రాష్ట్ర స్థూల ఉత్పత్తితోపాటు ఇతర ముఖ్యమైన సూచికలపై ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య నీతి ఆయోగ్ ప్రతినిధులకు వివరించారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

పారిశుద్ధ్యంపై ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. విద్యారంగానికి కేంద్రంనుంచి వివిధ పథకాలకింద వచ్చే నిధులను కోత లేకుండా విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ ఆచార్య కోరారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

నీతి ఆయోగ్ సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వైద్యరంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చంద వివరించారు.

English summary
NITI Ayog members met Telangana Cheif minister KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X