హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాఫిక్‌కు చెక్: అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లైఓర్లకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి నితిన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ జామ్‌కి చెక్‌ చెప్పేందుకు విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో పలు చోట్ల అండర్ పాస్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజా, శనివారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా రహదారుల విస్తరణ, స్కై వేల పనులకు శంకుస్థాపనలు జరిగాయి.

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు అలాగే ఆరాంఘర్-మెదక్ రోడ్ల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.426.52 కోట్ల అంచనాతో హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ సెక్షన్‌లో 62.92 కిలోమీటర్ల నిడివి గల డబుల్‌లేన్ల జాతీయ రహదారికి, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్, శంషాబాద్ సెక్షన్‌లో 10.48 కిలోమీటర్ల నిడివి గల ఆరు వరుసల రహదారికి కూడా శంకుస్థాపనలు చేశారు.

 Nitin Gadkari lays foundation stone for National Highway projects in Telangana

అంబర్‌పేటలోని శ్రీరమణ థియేటర్‌ చౌరస్తా నుంచి ఛే నంబర్ కూడలి వరకు, అలాగే, ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ రహదారిలోని సీపీఆర్‌ఐ వరకు దాదాపు 6.25 కిలోమీటర్ల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

English summary
The government has taken steps to expand the roads in the city to ease traffic congestion. The GHMC has provided 4 major projects in collaboration with the GHMC fund and the Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X