హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలియని స్థితిలో కొడుకు, కదిలిస్తున్న రాజధానిలో రైతు ఆత్మహత్య (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున.. సచివాలయం సాక్షిగా రైతు ఆత్మహత్య ఆందోళన కలిగిస్తోంది. బావిలో నీరు లేక, పోలం బీడుగా మారడంతో.. లక్షల అప్పు అయింది. దానికి తోడు కొడుకు మానసిక పరిస్థితి సరిగా లేక ఆసుపత్రి పాలయ్యాడు. పిల్లల చదువు ఖర్చులు భరించలేని స్థితి. వృద్ధ తల్లిదండ్రుల పోషణ భారమైంది.

ఈ స్థితిలో రైతు లింబయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. లోయర్ ట్యాంకుబండు రోడ్డులోని కట్టమైసమ్మ ఆలయ సమీపంలో విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకొని విగతజీవుడయ్యాడు. లింబయ్యది నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామం. బుధవారం ఉదయం ఆయన ఆత్మహత్య సంచలనం సృష్టించింది.

 రైతు ఆత్మహత్య

రైతు ఆత్మహత్య

తన తండ్రి బలవన్మరణాన్ని గోప్యంగా ఉంచి, మానసిక స్థితి బాగా లేని కుమారుడు నరేష్‌కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. కొడుకు లింబయ్య అర్ధంతరంగా తనువు చాలించడంతో ఈయన తల్లిదండ్రులు పెద్దబాలయ్య, భూమవ్వ కన్నీరుమున్నీరవుతున్నారు.

 రైతు ఆత్మహత్య

రైతు ఆత్మహత్య

కుటుంబ భారం మోసే పెద్ద దిక్కు లింబయ్య బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంతో ఈయన భార్య లక్ష్మి రోదిస్తోంది. డిగ్రీ చదువుతున్న కుమార్తె నవిత, కుమారుడు నవీన్‌ల భవిష్యత్తు ఏమిటంటూ, వృద్ధులైన అత్తమామల బాగోగులు చూసేదెవరంటూ గోసపెడుతోంది.

 రైతు ఆత్మహత్య

రైతు ఆత్మహత్య

రైతు లింబయ్య పెద్ద కుమారుడు నరేష్‌ డిగ్రీ చదివాడు. మూడు నెలల క్రితం వారసత్వంగా వచ్చిన గ్రామ సేవకుడి ఉద్యోగంలో చేరాడు. మూడు రోజులే విధుల్లో ఉన్నాడు. డిగ్రీ చదివి ఇదేం కొలువని అనేకమంది అంటుండటంతో జీర్ణించుకోలేని నరేష్‌ విధులకు గైర్హాజరయ్యాడు. తీవ్ర మనస్తాపంతో మూర్ఛవ్యాధికి గురయ్యాడు.

 రైతు ఆత్మహత్య

రైతు ఆత్మహత్య

ఈ నేపథ్యంలో కుమారుడికి వైద్యం అందించి మామూలు మనిషిగా చేసేందుకు లింబయ్య రూ.2 లక్షలు అప్పు చేశాడు. రాజధానిలో న్యూలైఫ్‌ ఆసుపత్రిలో చికిత్సచేయించారు. కోలుకోవడంతో స్వగ్రామానికి తీసుకొచ్చారు. నాలుగు రోజుల క్రితం రోగం తిరగబెట్టడంతో తిరిగి అదే ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి రూ.50వేలు ఖర్చు అవుతుందనడంతో అప్పుతెచ్చి రూ.20వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు. కుమారుడి ఆరోగ్యంలో మార్పురాకపోవడం, చికిత్సకు చేసిన అప్పులు పెరిగిపోతుండడంతో జీవితంపై విరక్తిచెందిన లింబయ్య చివరకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

 రైతు ఆత్మహత్య

రైతు ఆత్మహత్య

లింబయ్యకు చెందిన ఐదెకరాల పొలంలో మూడెకరాల భూమి బీడుగా మారింది. మిగిలిన దాంట్లో వర్షాధారం కింద సోయా సాగు చేశారు. సక్రమంగా వానలు కురవక పంట ఎండిపోయింది. అప్పు చేసి పంట వేశారు. వ్యవసాయానికి రూ.లక్ష, కుమారుడి వైద్యానికి రూ.2.50 లక్షలు కలిపి రూ.3.50 లక్షల అప్పు కావడంతో మున్ముందు రుణం తీర్చడం తనవల్ల కాదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 రైతు ఆత్మహత్య

రైతు ఆత్మహత్య

మంగళవారం కూడా కొడుకు నరేష్‌ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. రాత్రివేళ ఆసుపత్రిలో పిచ్చిపిచ్చిగా అరిచాడు. సిబ్బంది బయటకు పంపడంతో రాత్రంతా రోడ్లవెంట తిరిగాడు. బుధవారం ఉదయం ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. బస్సుకింద పడేందుకు ప్రయత్నించగా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రక్షించాడు.
తర్వాత కట్టమైసమ్మ ఆలయానికి వెళ్లి, పూజారికి రూ.10వేలు కానుకగా ఇచ్చాడు. ఆ తర్వాత విద్యుత్ స్తంభానికి ఉరేసుకున్నాడు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. మెదక్ జిల్లా జంగరాయికి చెందిన శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా జన్నేపల్లికి చెందిన నర్సింగ రావు, నల్గొండ జిల్లా ఈదులగూడెంకు చెందిన శ్రీను, నల్గొండ జిల్లాకేచెందిన అంజయ్య, పాలమూరు జిల్లా జమిస్తాన్ పూర్‌కు చెందిన చెన్నమ్మ, ఇదే జిల్లా అప్పారెడ్డిపల్లెకు చెందిన చంద్రానాయుడు ఆత్మహత్య చేసుకున్నారు.

అదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోను రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం నాడు దాదాపు పదిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అందరినీ కదిలిస్తున్నాయి. విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుండగా.. కాంగ్రెస్ పాలన వల్లే ఈ ఆత్మహత్యలు అని అధికార పక్షం ప్రతి విమర్శకు దిగుతోంది.

English summary
The horror of farmer suicides came to Hyderabad on Wednesday when a debt-ridden farmer from Nizamabad hung himself from an electrical transformer in the heart of the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X