Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదృష్టంగా భావిస్తున్నా: కంబోడియా, లావోస్ పర్యటనకు ఎంపీ కవిత

హైదరాబాద్: కంబోడియా, లావోస్ దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరితంగా బలోపేతం చేసేందుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు ఐదుగురు ఎంపీలు మంగళవారం నుంచి ఐదు రోజులు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

హమీద్ అన్సారీ బృందంలో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కంబోడియా, లాస్ దేశాలకు వెళ్తున్న ఎంపీ కవిత కొద్దిసేపటి క్రితం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ పర్యనటపై సోమవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

రెండో శతాబ్దం నుంచి కాంబోడియా దేశంతో భారతదేశానికి సంబంధాలున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులు, వ్యాపార సంబంధాల కోసం బుద్ధిజం వంటి సాంస్కృతిక సంబంధాలను పునరుద్దరించుకోవడం, బలోపేతం చేయడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తామని కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతినిధిగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తనను ఎంపిక చేశారని, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బృందంలో ఆయన సతీమణి సల్మా అన్సారీ, కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి సన్వర్‌లాల్ జాట్, ఎంపీలు హుస్సేన్ దల్వాల్, సుఖేందు శేఖర్‌రాయ్, అజయ్ సంచేటి, ఉపరాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి, వ్యక్తిగత కార్యదర్శి తదితరులు ఈ పర్యటనకు వెళుతున్నారు.

ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ బృందం కాంబోడియాలో, 17వ తేదీ నుంచి రెండు రోజుల పాటు లావోస్‌లో పర్యటిస్తుంది. కాంబోడియా ప్రధాని డాక్టర్ హున్‌సేన్‌తో ఈ బృందం భేటీ అవుతుంది. అక్కడి సెనేట్ జాతీయ అసెంబ్లీని సందర్శించనున్నారు. మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారు.

ఆ తర్వాత మెకాంగ్-గంగా టెక్స్‌టైల్ మ్యూజియంను, ఆంకోర్‌వాట్, టా-ప్రోమ్ తదితర ఆలయాలను సందర్శించనున్నారు. కాంబోడియాలోని సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను సందర్శించడంతో పాటు ఆ దేశ పార్లమెంటరీ వ్యవస్థపై అధ్యయనం చేస్తారు.

లావోస్ పర్యటనలో ఆ దేశ రాష్ట్రపతి చౌమ్మలి సయసోన్, ఉప రాష్ట్రపతి బౌన్‌హాంగ్ వోరాచిట్, ప్రధాని తాంగ్‌సింగ్ తమావోంగ్‌లతో భేటీ అవుతారు. రెండు దేశాల పర్యటనను ముగించుకున్న అనంతరం ఈ బృందం ఈనెల 18వ తేదీన తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. రెండు నెలల క్రితం ఎంపీ కవిత లోక్‌సభ స్పీకర్ నేతృత్వంలో బెల్జియం, నార్వే తదితర దేశాలలో పర్యటించిన సంగతి తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+