సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులపై కండక్టర్ వివరణ

Posted By:
Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: తాను ముఖ్యమంత్రిని గానీ, ఆర్టీసీ అధికారులను గాని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఆర్టీసీ బస్ కండక్టర్ సంజీవ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులపై వివాదం నెలకొంది.

కెసిఆర్‌‌పై పోస్ట్: కండక్టర్‌పై విచారణకు ఆర్టీసీ ఆదేశం

ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారని నిజామాబాద్ 1 ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న సంజీవ్ పైన అధికారులు విచారణ చేపట్టారు.

Nizamabad RTC conductor in line of fire for his anti government posts

ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను సీఎంను గానీ, ఆర్టీసీ అధికారులను గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.

ఆర్టీసీలో సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న పని భారాలపైనే సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేశానని, ఆర్టీసీ అభివృద్ధి, ప్రజల సౌకర్యాల కోసమే ఆ పోస్టింగ్ పెట్టాను తప్ప ఎవరినీ విమర్శించలేదన్నారు.

కండక్టర్ సంజీవ్ పైన విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని ఉత్తర్వులు అందాయని, సంజీవ్ కరీంనగర్లో విచారణకు హాజరయ్యాడని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉత్తర్వులు అందాక చర్యలు ఉంటాయని డిపో మేనేజర్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana government has started lambasting all those who continue to post against the government in the social media and Chief Minister K Chandrasekhar Rao warned of dire consequences on everyone who posted against TRS (Telangana Rashtra Samithi) government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి