• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ భగీరథకు ఎలాంటి అవార్డు ఇవ్వలేదు.!కేంద్ర జలవనరుల శాఖ వివరణ.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్: దేశానికే గర్వకారణంగా రూపొందించిన మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డులు రావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టికి ఇదే నిదర్శనమని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్న అంశం తెలిసిందే. ఇదే అంశం పట్ల ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతోంది. అవార్డుకు సంబందించిన జాతీయ సంస్ధలు, ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకానికి ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ, ఎప్పుడు అవార్డు ప్రకటించింది అనే అంశంపై ఆయా శాఖలు ఆరా తీసి నిజాలను నిగ్గు తేలుస్తున్నాయి.

 మిషన్ భగీరథకు ఎలాంటి అవార్డు ఇవ్వలేదు..

మిషన్ భగీరథకు ఎలాంటి అవార్డు ఇవ్వలేదు..

గత సోమవారం సోమాజీగూడలోని ఇంజనీరింగ్ ఇన్ ఛీఫ్ బిల్డింగ్ లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మిషన్ భగీరథ పథకానికి కేంద్రం అవార్డు ప్రకటించిందని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అసలు కేంద్ర జలవనరుల శాఖ గానీ, జల్ జీవన్ మిషన్ గానీ ఎలాంటి అవార్డులు ప్రకటించలేదని ఆయా శాఖలు స్పష్టం చేసాయి. అందుకు సంబంధించి అన్ని వివరాలతో ఒక లేఖను కూడా మీడియాకు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో హడావిడిగా విలేఖరుల సమావేశం నిర్వహించి మిషన్ భగీరథకు అవార్డు వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలను మంత్రులు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని స్థానిక బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 మేం చెప్పిందొకటి.. వాళ్లు చెప్పిందొకటి..

మేం చెప్పిందొకటి.. వాళ్లు చెప్పిందొకటి..

సీఎం చంద్రశేఖర్ రావు మానసపుత్రిక మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం 'నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ అవార్డు' ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించిన వార్త మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ వార్త పూర్తిగా సత్యదూరం. ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.

అంతా సొంత డబ్బానే..

అంతా సొంత డబ్బానే..

మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం పచ్చి అబద్దమని, మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదన్నారు. తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ఎక్కడా ధ్రువీకరించనేలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదించిందని మీడియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలి కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించనేలేదనే అంశాన్ని కూడా లేఖలో ఊటంకించారు.

 మంత్రుల ప్రకటనల్లో పచ్చి మోసం..

మంత్రుల ప్రకటనల్లో పచ్చి మోసం..

గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే అక్టోబరు 2న తెలంగాణకు అవార్డుకు ఎంపికైంది. ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ డేటా ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాలలో శాంపిల్స్ పరీక్షించగా, 8% నివాసాలు ప్రతిరోజు 55 లీటర్ల తలసరి నీటి కంటే తక్కువ తాగునీరు పొందుతున్నాయి. అదేవిధంగా మొత్తం నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించింది. అందుకు తగ్గ అంశాలను కూడా లేఖలో కేంద్ర అధికారులు వివరించారు. దీంతో మిషన్ భగీరథ పథకానికి అవార్డు వచ్చిందనే అంశం పచ్చి అబద్దమని, తెలంగాణ ప్రజలను ఏమార్చడానికేనని బీజేపి నేతలు స్పష్టం చేస్తున్నారు.

English summary
Criticism has been pouring in over the statement that the Center has announced the award for Mission Bhagiratha scheme by Ministers Harish Rao and Errabelli Dayakar Rao at the Engineering in Chief Building in Somajiguda. The respective departments clarified that neither the Central Water Resources Department nor the Jal Jeevan Mission had announced any awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X