వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్షన్ 8పై కేంద్ర ఆదేశాలు ఊహాజనితాలే: కేంద్ర హోం శాఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8పై మీడియాలో వచ్చిన వార్తలు కేవలం ఊహాజనితాలని కేంద్ర హోంశాఖ కొట్టిపారేసింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారమూ లేదని తేల్చి చెప్పింది. ఇప్పటివరకూ ఈ అంశానికి సంబంధించి గవర్నర్‌కు ఎలాంటి నోట్‌నూ పంపలేదని, పంపే అవకాశం లేదని, అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. తెలంగాణ బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కూడా మంగళవారం సాయంత్రం ఇదే విషయం చెప్పారు.

సెక్షన్ 8 ఉన్నది చట్ట విరుద్ధమైన చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు భద్రత కల్పించేందుకు కాదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పింది. నగరంలో ఏపీ పోలీసులు స్టేషన్లను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని హోంశాఖ తేల్చి చెప్పినట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

No base for media reports on section 8: Home ministry

హైదరాబాదులో ఏపీ పోలీసులకు జ్యూరిస్‌డిక్షన్ ఏమీ ఉండదని స్పష్టం చేసింది. సెక్షన్-8పై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంవల్ల ప్రజల్లో తలెత్తిన గందరగోళాలపై ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారితో తాము మాట్లాడినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక చెప్పుకుంది. దీనిపై పూర్తిగా ఉన్నతాధికారి ఒకరు స్పష్టత ఇచ్చినట్లు ఆ పత్రిక తెలిపింది.

నమస్తే తెలంగాణ పత్రిక కథనం ప్రకారం - పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని నిశితంగా అధ్యయనం చేసినవారెవ్వరికీ ఇలాంటి సందేహాలు రావని వ్యాఖ్యానించారు. చట్టాన్ని బ్రహ్మ పదార్ధంగా చూపించి గందరగోళం సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలే ఇప్పుడు సంచలన వార్తలుగా వచ్చిన వదంతులని అన్నారు.

సెక్షన్-8 గురించి ఇంత భారీ స్థాయిలో చర్చ అవసరమే లేదని, పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలుచేసే బాధ్యత చూస్తున్న గవర్నర్‌కు అన్నీ కూలంకషంగా తెలుసునని చెప్పారు. దీని అమలును పర్యవేక్షించే కేంద్ర హోంశాఖకు ప్రతి అక్షరంపై స్పష్టమైన అవగాహన ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్‌నుంచి న్యాయ సలహా కోరాల్సిన అవసరం ఏర్పడదని వ్యాఖ్యానించినట్లు ఆ పత్రిక రాసింది.

సెక్షన్-8కు సంబంధించి గవర్నర్‌కు కేంద్ర హోంశాఖనుంచి ప్రత్యేక ఆదేశం ఏదైనా వెళ్ళిందా? అని ఆ అధికారిని ప్రశ్నించగా, అలాంటిదేదీ ఇప్పటివరకూ వెళ్ళలేదని, వెళ్ళడానికి అవకాశం కూడా లేదని చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్-8 గురించి చాలా స్పష్టంగా ఉన్నదని, ఇందులో ఎలాంటి గందరగోళం లేదనిచెప్పారు. నిశితంగా పరిశీలించినట్లయితే అన్ని సమాధానాలూ ఇందులోనే దొరుకుతాయని అన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది.

English summary
According to Namasthe Telangana daily - Union Home ministry is having clarity on section and has not given any direction to governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X